కల్తీ పాల తయారీ వ్యాపారి ఇంటిపై దాడి చేసిన ఎస్.ఓ.టి పోలీసు బృందం

భువనగిరి ఇంఛార్జి జనవరి 31(నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తుపెల్లి బాల్ రెడ్డి కల్తీ పాల వ్యాపార వేత్త ఇంటిని బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబందించిన ఎస్.ఓ.టి భువనగిరి బృందం బ్రాహ్మణపల్లి గ్రామంలో తుపెల్లి బాల్ రెడ్డి పై దాడి చేయడము జరిగింది. అక్కడ వెల్లి చూస్తే అతను పాలను కల్తీ చేస్తున్న మాట నిజమే ధోల్‌పూర్ తాజా స్మిక్డ్ మిల్క్ పౌడర్‌లో కల్తీ చేసి, 200 లీటర్ల పాలను కల్తీ చేసి అవసరమైన వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. సమాచారం మేరకు ఎస్.ఓ.టి పోలీసు దాడులు నిర్వహించారు.
ప్రతివాది వివరాలు: తూపెల్లి బాల్ రెడ్డి గ్రామం, బ్రాహ్మణపల్లి, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా,
ఆస్తులు స్వాధీనం చేసుకున్న వివరాలు:
1. కల్తీ పాలు -200 లీటర్లు.
2.ధోల్పూర్ తాజా స్కిమ్డ్ మిల్క్ పౌడర్-2 ప్యాకెట్లు (ఒక్కొక్కటి – 1కేజీ ఉంటాయి)
3.ఖాళీ పాల పొడి ప్యాకెట్ -01
4.ఫోర్ వీలర్ జీతో వాహనం -1
పైన తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేశారు అవసరమైన చర్యల కోసం అందుబాటులో ఉన్న స్థానిక బీబీనగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించాము అని తెలిపారు.