రికార్డు స్థాయిలో అత్యుత్తమమైన బొగ్గు నీ అందించడమే లక్ష్యం- జిఎం జక్కం రమేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 31 (నిజం న్యూస్)
కొత్తగూడెం ఏరియా జి.ఎం ఆఫీసు నందు గల కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం నాడు సింగరేణి బొగ్గు ఉత్పత్తి,లక్ష్యాల పై ఏరియా జిఎం జక్కo రమేష్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ మాట్లాడుతూ 2022-2023 ఆర్థిక సంవత్సరం జనవరి నెల కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడినది 13.71 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 13.78 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 101 % ఉత్పత్తి సాధించడం జరిగినది.అలాగే జేవిఆర్ ఓసి కి నిర్ధారించిన జనవరి లక్ష్యాన్ని అధిగమించి 127% తో 11.91 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం జరిగినదనీ,అలాగే కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జనవరి వరకు 113.13 లక్షల టన్నులకు గాను 101.51 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 90% ఉత్పత్తి సాదించామని తెలిపారు.అంతేకాకుండా రోడ్డు మరియు రైల్ ద్వారా జనవరి నెల కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడినది 13.71 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 14.78 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 108 % ఉత్పత్తి సాధించడం జరిగిందని అలాగే కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జనవరి వరకు 113.13 లక్షల టన్నులకు గాను 107.34 లక్షల టన్నులు బొగ్గు రవాణా జరిగినది అని కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేశ్ పత్రిక ప్రకటనలో భాగంగా తెలియజేసారు.ఈ జనవరి నెల 20.01.2023 న అత్యధికంగా 13 రేకులు రవాణా చేయడం జరిగిందని కొత్తగూడెం చరిత్ర లోనే జనవరి నెలలో 322 రేకులు రవాణా చేసి అంతకు ముందు నెలకొల్పిన 300 రేకులు (డిసెంబర్ నెల)రికార్డును బద్దలుచేయడం జరిగిందని తెలియజేశారు.ఈ విలేకరుల సమావేశంలో ఏరియా జిఎం జక్కం రమేశ్ తో పాటు ఎస్‌ఓటు జిఎం ఆర్.నారాయణ రావు,ఏజెంట్ బూర రవీందర్,ఏజిఎం (సివిల్) సూర్యనారాయణ,డి.జి.ఎం.(పర్సనల్)సామూయెల్ సుధాకర్, డి.జి.ఎం.(ఎఫ్.&ఏ)రాజశేఖర్, డి.జి.ఎం(ఐ.ఈ)యోహాన్,సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమనా రెడ్డి, సీనియర్ పి.ఓ.లు మజ్జి మురళి,జి. సుధాకర్,కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.