తడి, పొడి చెత్తను కృత్రిమ ఎరువుగా తయారు చేయుటకు అవగాహన సదస్సు

మాడ్గుల జనవరి 31( నిజం న్యూస్): మాడ్గుల మండలంలోని అన్ని గ్రామాలలో తడి, పొడి చెత్తను కృతమ ఎరువుగా తయారు చేయుటకు ప్రభుత్వ ఆదేశాను సారం అంకెల పరమేశ్వరి బయో ఫర్టిలైజర్ మేనేజర్ వెంకట్ ఆధ్వర్యంలో వానపాములను వినియోగించి కృత్తిమ ఎరువును ఎలా తయారు చేయాలో పంచాయతీ కార్యదర్శులకు, మల్టీ పర్పస్ వర్కర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాఘవులు, ఎం పి ఓ వేజన్న, తదితరులు పాల్గొన్నారు.