Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విధులకు హాజరు కావడం లేదంటూ ఏఈ బాబురావు ఫై సీఈఓ ఆగ్రహం

వార్షిక తనిఖీ కోసం మండలపరిషత్ కు విచ్చేసిన జడ్పీ సీఈఓ సురేష్.

హాజరు, మూమెంట్ రిజిస్టార్ లేని పి ఆర్ ఏఈ కి వేతనం ఎలా ఇస్తున్నారంటూ ఎంపీడీఓ పై మండిపాటు.

ఆత్మకూరు ఎస్ జనవరి 31 (నిజం న్యూస్):

మండలంలోని ఎదురు నిర్వహిస్తూ హాజరు మూమెంట్ రిజిస్టర్ లేని పంచాయతీ ఏఈ ఫై జడ్పీ సీఈవో సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయానికి హాజరై మాట్లాడారు. మండల పంచాయతీరాజ్ ఏఈ మండల పరిషత్ లో హాజరు, మూమెంట్ రిజిస్టర్ లేకుండా మండలం నుంచి వేతనం ఎలా తీసుకుంటున్నాడని ఎంపీడీఓ ఫై మండిపడ్డారు. పల్లె ప్రకృతి వనాల పరిరక్షణ ఫై గ్రామ పంచాయతీ లు శ్రద్ద వహించాలన్నారు.పల్లె ప్రకృతి వనాల్లో శుభ్రం చేసి నీటి సదుపాయం కల్పించాలని కోరారు. అదేవిధంగా వర్మి కంపోస్టులను, స్మశాన వాటిక లను వాడకంలోకి తేవాలని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయానికి 18 శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ గార్డెన్ ను పరిశీలించారు. మండల పరిషత్ పరిధిలో ఏడాదికాలంగా నిర్వహించిన పనులు నిధుల సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఈవో వెళ్లే ముందు పంచాయతీరాజ్ ఏఈ బాబురావు పరిషత్ కు వచ్చారు. హాజరు, మూమెంట్ రిజిస్టర్ లేకుండా విధులు ఎలా నిర్వహిస్తున్నావని సీఈఓ ప్రశ్నించగా ఉన్నాయని ఏఈ బాబురావు సమాధానం ఇవ్వడంతో మండలంలో పనిచేసుకుంటూ డీఈ ఆఫీస్ లో రిజిస్టర్లు ఎలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక నుండి మండలం లో విధులకు సక్రమంగా హాజరు కావాలని రిజిస్టర్ లు ఇక్కడే ఉండాలని లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ మల్సూర్ నాయక్ ఎంపీఓ సంజీవ, దయాకర్ రెడ్డి,ప్రసాద్,స్వామి,జడ్పీ సూపరేండెంట్ విజయలక్ష్మి, బిందుమాదవి,వెంకట్,అనిఫ్, కోటమ్మ, తదితరులు పాల్గొన్నారు…