ఆత్మీయ మిత్రుల ఆధ్వర్యంలో దంపతులను సన్మానించి బహుమతి ప్రధానం

*ఆత్మీయ సోదరుల సంఘం బంజారాహిల్స్ భువనగిరి…
భువనగిరి ఇంఛార్జి జనవరి 31 (నిజం న్యూస్)
పట్టణ కేంద్రంలోని 32వ వార్డు బంజారాహిల్స్ లో ఆత్మీయ మిత్రులు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి గృహ ప్రవేశం, ఓమం, ఇంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఆత్మీయ సోదరుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వారి దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి బహుమతి ప్రధానం చేసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వా అధికారి రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు భువనగిరి శ్రీనివాస్ గుత్తా, భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు ముత్యాల ఆనంద్, రాము గౌడ్, అనుగు ప్రభాకర్, సీనియర్ విలేకర్ గట్టికొప్పుల శ్రీనివాస్, ఆత్మీయ సోదరుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వరం శ్రీనివాసులు, సభ్యులు చందం సత్యనారాయణ, వినోద్, బద్రయ్య బంధు మిత్రులు తది తరులు పాల్గొన్నారు.