అక్షర స్కూల్ వద్ద ఉద్రిక్తత! నైనిక మృతిపై విచారణ జరిపించాలి

అక్షర స్కూల్ బస్సు దిగుతూ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి, న్యాయం చేయాలని డిమాండ్.
జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలపై విచారణ జరిపించాలి.
సూర్యాపేట ప్రతినిధి జనవరి 31 నిజం న్యూస్
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక రెండో వార్డు కోమటికుంట గ్రామానికి చెందిన మేడారపు శేఖర్,నాగరాణి దంపతుల నైనిక(2సంవత్సరాలు) స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్ కిందపడి మృతి చెందిన ఘటన మంగళవారం విషాదం చోటు చేసుకుంది. అక్షర స్కూల్ డ్రైవర్ అనుభవ లేమి నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్ల మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. అక్షర స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.