ఎస్సీ మహిళల ఆర్థిక అభ్యున్నతికి టెయిలరింగ్ ద్వారా ప్రోత్సాహం – మంత్రి కొప్పుల

జగిత్యాల, జనవరి 30 (నిజం న్యూస్ ప్రతి నిధి )
ఎస్సీ లలో ఉన్న తారతమ్యం పోయి వారు ఆర్థికంగా నిలదోక్కుకోవాలనే ఉద్దేశ్యంతో టెయిలరింగ్ శిక్షణను అందించి, మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రోత్సహం అందించడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సోమవారం జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం బతికెపెల్లి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ జగిత్యాల వారి ఆర్థిక సహకారంతో మరియు స్టార్ మహిళ మండలి ఆధ్వర్యంలో అర్హులైన 50 మంది దళిత యువతులను ఎంపిక చేసి కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు….
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
మూడు నెలల క్రితం బతికెపెల్లి గ్రామానికి వచ్చిన సమయంలో గ్రామ ఎస్సీ యువతులకు కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది, ఇచ్చి మాట ప్రకారం ఈరోజున 50 మంది ఎస్సీ మహిళను గుర్తించి, వారికి మూడు నెలల (90 రోజులు) టెయిలరింగ్ పై శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఎస్సీ, బిసి మరియు రెసిడెన్సి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు సంబంధించిన యూనిఫామ్స్ కుట్టడానికి బయటివారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పూర్తయిన వెంటనే ఆ కాంట్రాక్టును మీకే అందించడం జరుగుతుందని హామిఇచ్చారు.
సాదారణంగా ఒకటి రెండు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణను ఇచ్చి అనంతరం సర్టిఫికెట్ తో పాటు కుట్టుమిషన్ను మహిళకు అందించడం జరిగేదని, మహిళను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో శిక్షణ కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మొదటి రోజునే కుట్టు మిషన్ లను అందించి శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
మనం చేతిలో ఉన్న వృతిని నమ్ముకోవడం వలన ఎక్కడికి వెళ్లిన బ్రతకగలమనే స్థైర్యాన్ని పొందగులుగుతారని అన్నారు.
ఈ అవకాశాన్ని తేలికగా తీసుకోకూడ, మీ జీవితాన్ని మార్చే అవకాశం గా మార్చుకోవాలని, మంత్రి అన్నారు ..
ఎంపిక చేసిన 50 మంది శిక్షణను విజయంతం చేసి మరికొంతమందికి స్పూర్తిగా ఉండాలని అన్నారు.