గ్రంథాలయం వద్ద … రాజకీయా లా??

అమరవీరుల చిత్రపటాలు మరిచిన..గురువులు, నాయకులు.
జెండా పండగ . రోజు. వెంపటిలో..రగడ… రగడ.
ఆలస్యంగా మండలంలో వెలుగు చూసిన వైనం….
సూర్యాపేట ప్రతినిధి జనవరి 28 నిజం న్యూస్
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితం చెప్పవచ్చు. దీనితో లిఖిత పూరకమైన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో పౌరులందరికీ హక్కులు ,చట్టాలు రిజర్వేషన్ కల్పించిన , మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనత. ఇటువంటి తరుణంలో ఎంతోమంది రాజకీయ నాయకుల పుట్టినిల్లు అయిన వెంపటి గ్రామంలో…. సాక్షాత్తు జనవరి 26 రోజున వెంపటి కేంద్ర బిందువైన గ్రంథాలయం వద్ద కనీసం అమరవీరులైన మహాత్మా గాంధీ, నెహ్రు, అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల చిత్రపటాలను విస్మరించారు. దీనితో దేశభక్తి గల ఓ యువకుడు చిత్రపటాలు లేవని ప్రశ్నించడంతో… స్థానిక నాయకులు…, గురువులు అతన్ని అవమానించారు…. అనంతరం జగడం ముదరడంతో తిరిగి పాఠశాలకు వెళ్లి అంబేద్కర్ చిత్రపటాన్ని తీసుకొని వచ్చి… పెట్టి ….జెండా ఎగరవేశారు.. ఏది ఏమైనా జరిగిన సంఘటనలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు, ఇతర పార్టీ.. నాయకులతో కలిసి మెప్పుకోసం మాట్లాడడం విడ్డూరం..
ఈ తతంగం మొత్తం … బిగ్ బాస్…. కు చేరినట్లు సమాచారం.. ఈ రగడ కు బాధ్యులెవరో.. గ్రామములో… ఏమి జరుగుతుందో వేచి చూద్దాం…