కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలు

మాడ్గుల జనవరి 27( నిజం న్యూస్): మాడ్గుల మండలంలోని కలకొండ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ బంకు సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు వెల్దండ మండలంలోని అంకమోని కుంట గ్రామ పంచాయతీకి చెందిన చంద్రయ్య, చంద్రశేఖర్ కు గాయాలు కావడంతో జీవన్ వైద్యశాలకు తరలించారు. బాధితుని అన్న బైకని వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు