స్వయంభు శివాలయం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఐక్యత పౌండేషన్ చైర్మన్

మాడ్గుల జనవరి 27( నిజం న్యూస్):
మాడ్గుల మండల కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభు శివాలయం ప్రథమ వార్షికోత్సవానికి శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వేలయేండ్ల చరిత్ర గలిగిన శ్రీ స్వయంభు శివాలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు అదేవిధంగా ఇంతటి చరిత్ర కలిగిన దేవాలయాన్ని పునర్మించుకొని ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషకరమని తెలుపుతు ఈ పురాతన దేవాలయ పునర్నిర్మాణంలో తన వంతుగా ఐక్యత ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సూదిని పద్మనాభ రెడ్డి మాట్లాడుతు ఈ ఆలయ అభివృద్ధికి మంచి మనసుతో చరిత్ర ఆనవాళ్లను భవిష్యత్ తరాలకు అందించడానికి రాఘవేందర్ రెడ్డి 10 లక్షల రూపాయలు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సూదిని పద్మనాభ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.