ఈనెల 29న గౌతమ బుద్ధుడు యొక్క విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయండి

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జనవరి 26 (నిజం న్యూస్)
ఈనెల 29-01-2023 ఆదివారం రోజున లోకేశ్వర మండల కనకాపూర్ గ్రామంలో విశ్వశాంతి దూత తథాగత్ భగవాన్ గౌతమ బుద్ధుడు యొక్క భవ్య విగ్రహ ప్రతిష్ట స్థాపన జరగబోయే కార్యక్రమంలో ఈ రోజు గ్రామ సభ్యులతో సన్నాహక సవవేశానికి భైంసా పట్టణానికి చెందిన డా, బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ కమిటి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా కమిటి సభ్యులు మాట్లాడుతూ 29వ తేదిన ఉ.11.00. గంటలకు విశ్వరత్న డా,బి.అర్.అంబేద్కర్ గారి మనుమడు భీమ్ రావ్ యశ్వంత్ రావు అంబేద్కర్ గారు విచేస్తున్నారు.వారి శుభ హస్తలతో విశ్వశాంతి దూత గౌతమ బుద్ధుని విగ్రహ ఆవిష్కరించనున్నారు. కావున నియోజక వర్గ ప్రజలు వేల సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమంలో హాజరై కార్యక్రమానికి విజయవంతం చేయగలరని అంబేద్కర్ విగ్రహ కమిటి సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్ చంద్రే,గౌతం పింగ్లె కౌన్సిలర్,భీంరావ్ డోంగ్రే,గిరిధర్ జంగ్మె, సుంకేట పోశట్టీ ,గంగాధర్ దగ్డే, లక్ష్మణ వొడేకర్, దళితానంద్ బన్సొడే,సురేష్ షానే, గోవర్ధన్ కండ్కే పాల్గొన్నారు.