మొల్కపట్మం సిపిఎం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ జేరుపోతుల ఎల్లమ్మ
మిర్యాలగూడ జనవరి 24.(నిజంన్యూస్) వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామం సిపియం పార్టికి చెందిన మాజీ సర్పంచ్ జేరుపోతుల ఎల్లమ్మ సిపియం పార్టి నుండి కాంగ్రేస్ పార్టీలో చేరారు.
కాంగ్రేస్ పార్టి మున్సిపల్ ప్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు.మొల్కపట్నంగ్రామంలో
ప్రస్తుతం సిపియం పార్టీకి ఉన్న ఏకైక వార్డు నెంబర్ జేరుపోతుల ఎల్లమ్మ మాత్రమే.
త్వరలో జరగ నున్న శాసన సభ ఎన్నికలలో టిఆర్ఎస్ ,సిపియం అలవెన్స్ లో సిపియం మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతున్న తరుణం లో సిపియం పార్టీకి మెట్టినళ్ళు లాంటి మొల్కపట్నం మాజి సర్పంట్,9వ వార్డు నెంబర్ కాంగ్రేస్ లో చేరటం సిపియం పార్టికి చాలా నష్టమనే చెప్పవచ్చు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెమడాల కర్ణాకర్,వార్డు మెంబర్లు పేరెళ్ళి నగేష్,రాచూరి వెంకన్న ,కొమ్మనబోయిన ఆంజనేయులు,కాంగ్రేస్ నాయకులు తమ్మడబోయిన అర్జున్,కాంగ్రేస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షులు పాదుల కిరణ్,నాయకులు బారి పాండు,మోసాల శ్రీకాంత్ పాల్గొన్నారు.