అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి…..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

యదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జనవరి 20(నిజం న్యూస్)

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు..గురువారం నాడు కాన్ఫరెన్స్ హాలులో వచ్చే జనవరి 26 న గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లను ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనవరి 26 న కలెక్టరేట్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడతాయని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో అమలు జరుగుచున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై ప్రసంగ పాఠం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి తయారు చేయాలని, వేదిక, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ పూర్తిచేయాలని, జాతీయతా భావం పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ శాఖలు నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద స్టాల్స్ ఏర్పాటు,

మెడికల్ క్యాంప్, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ తదితర ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు..కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకట్ రెడ్డి, జిల్లా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సి.హెచ్. కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా మహిళా శిశువు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యాన అధికారి అన్నపూర్ణ, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, ఆర్.అండ్.బి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శంకరయ్య, జిల్లా పశుసంవర్ధక అధికారి కృష్ణ, జిల్లా భూగర్భ అధికారి జ్యోతి కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరచారి, జిల్లా వైద్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినోద్, తహసిల్దార్ వెంకట్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు..