Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొత్తగూడెంలో పెరిగిపోతున్న “క్రైమ్ రేట్”

 

-కొత్తగూడెంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు*. -సెటిల్మెంట్లకి,బెల్ట్ షాపులకు అడ్డాగా మారిన కొత్తగూడెం విద్యానగర్ కాలనీ బైపాస్.. -ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ 24*7 సర్వీస్ అంటున్న బెల్ట్ షాప్ నిర్వాహకులు. -మద్యం మత్తులో దాడులు చేసుకుంటున్న యువత -మామూల మత్తులో అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 19 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనీ కొత్తగూడెంలో బెల్టు దందా జోరుగా సాగుతోంది.పల్లెలు,పట్టణాలని తేడాలేకుండా కిరాణాదుకాణం నుంచి మొదలుకొని నివాసగృహాలు,పాన్‌ షాప్‌లు, చిన్న చిన్న కిరాణా షాపులువద్ద మద్యం ఏరులై పారుతోంది.జిల్లాలోని దాదాపు అ న్ని మండలాల్లో, గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.ప్రతి రోజు కష్టపడి పనిచేసే భవననిర్మాణ కార్మికులు,కూలీలు,హోటల్లో పనిచేసే కార్మికులు,ఇసుక రవాణా కార్మికులకు తెల్లవారు జామునే మద్యం అందిస్తు బెల్టు దందాను యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం వైన్ షాపులకు రోజుకి ఒక సమయం వరకే అనుమతి ఉంటుంది.కానీ ఏ టువంటి అనుమతులు లేని బెల్ట్ షాపులు మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. లోతువాగు, సఫాయి బస్తీ చుంచుపల్లి, హౌసింగ్ బోర్డ్,విద్యానగర్ కాలనీ,సర్వారం, సుజాతనగర్,జూలూరుపాడు, అనిశెట్టిపల్లి పాల్వంచ, పోస్టాఫీస్ రామవరం,రుద్రంపూర్ లో గల్లీకి ఒక బెల్ట్ షాప్ వెలియడంతో మద్యం ప్రియులు ఉదయం టీ,కాఫీకు బదులుగా మద్యాన్ని తాగి ఎక్కడ పడితే అక్కడ దొర్లుతున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో గల చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న విద్యానగర్ కాలనీ బైపాస్రోడ్ నుండి హౌసింగ్ బోర్డ్ వరకు కేవలం 500 మీటర్ల పరిధిలోనే రోడ్ మీదనే 15 నుంచి 20 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు.ఈ ప్రాంతాల్లో ఉదయం పూట ప్రత్యేకమైన వాహనాలలో తీసుకుని వచ్చి మరీ పరిసరాలలో వున్న ప్రతి ఒక్క బెల్ట్ షాపు కు కమిషన్ కి మద్యం సరఫరా చేస్తున్నారు.ఈ విషయం ఎక్సైజ్‌ అధికారులకు తెలిసిన అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు లేకపోలేదు. అంతేకాకుండా ప్రతి బెల్ట్ షాప్ నుంచి నెలకి 3000నుంచి 5000 రూపాయలు మామూలు రూపంలో అక్కడి స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాయని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ————-

*ఏరులై పారుతున్న మద్యం*..

ఒక్కప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉండే బెల్ట్ షాపులు ఇప్పుడు పోటా పోటీగా రోజుకి అనేకంగా వెలుస్తున్నాయి.మద్యం ప్రియులు రాత్రి వేళల్లో ఎక్కువ శాతం బెల్ట్ షాపులకి వస్తుండడంతో అధిక ఆదాయం గురించి బెల్ట్ షాప్ నిర్వాహకులు కల్తి మధ్యo కూడా తయారు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.చాలామంది యువత మద్యానికి బానిసలుగా మారి ఇబ్బందులు పడుతున్నా కమీషన్లకు కక్కుర్తిపడుతున్న సిబ్బంది దాడులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.బెల్టు దుకాణాల్లో బాటిళ్లను ఎంఆర్‌పీ కంటే రూ.30 నుంచి 50వరకు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.సమయపాల పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో అనేక ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి.వీటినీ నియంత్రించాల్సిన వారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో బెల్ట్ షాపు నిర్వహణపై మరియు ఇతరులపై దాడులు జరిగిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి.ఏ వైన్ షాప్ లో దొరకని మధ్యం బ్రాండ్లు, బీర్లు అన్ని బెల్ట్ షాపుల్లో దొరకడం వెనక అధికారులు దాడులు చేయడంలో నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం అవుతుందనీ,ఎక్సైజ్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. పొద్దుటి నుంచి కూలినాలి చేసుకుని సంపాదించిన మొత్తాన్ని బెల్టు షాపుల్లో అధిక రేట్లకు మద్యాన్ని కొనుగోలు చేసి రోజు కూలి చేసుకునే వాళ్ళు తమ సంపాదన మొత్తం బెల్ట్ షాపులకే ఖర్చు చేస్తు, నిత్యం మధ్యానికి బానిసలు అవుతూ తమ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సేంజ్,పోలీస్ శాఖ అక్రమంగా నడిచే బెల్ట్ షాపులను నియంత్రించాలని అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.