Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భయాందోళన లో మైహోమ్ సిమెంట్స్…?

*అధికారులు దాడులపై మై హోమ్ యాజమాన్యం గుండెల్లో భయం..భయం..

*సీజ్ చేస్తారన్న భయంతో రాత్రికిరాత్రే గేట్లు తొలగింపు.

*తప్పు అని తెలిసినా, అనుమతి లేకున్నా గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు.

*పరువు కాపాడుకునేందు మైహోం ప్రయత్నం.

* మైహోమ్ నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదించిన గ్రామపంచాయతీ అధికారులు.

 

హైదరాబాద్, జనవరి 19, నిజం న్యూస్:

వందల ఎకరాల్లో పరిశ్రమ, వేలకోట్లలో లావాదేవీలు, పలు దేశాల్లో ఆఫీసులు. చివరికి భయం..భయంగా నిర్మాణాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం మాత్రం రాజకీయ నాయకులతో అటకాగడమే అని అర్థమవుతుంది. మొన్నటి వరకు అధికార ప్రభుత్వంలో ఆ సంస్థ వ్యక్తులకు, వారి సంస్థకు ప్రత్యేక స్థానం.రాష్ట్ర ప్రభుత్వం వేరు..ఆ కంపెనీకి చెందిన వ్యక్తులు వేరు కాదు అనే విధంగా అందరూ భావించారు. చిన్న మనస్పర్ధలతో ఇద్దర మధ్య బంధం కాకవికలమైంది. దీంతో ఆ కంపెనీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

 

*భయం భయంగా మైహోమ్ యాజమాన్యం*

 

తెలంగాణ రాష్ట్రంలో మైహోమ్ సంస్థ అత్యంత భారీ సంస్థ. సిమెంట్స్, పవర్ ప్లాంట్స్, మీడియా, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రాష్ట్రంలోనే వారిది మహా సంస్థ. మొన్నటి వరకు ప్రభుత్వ పెద్దలతో చెట్టాపట్టాలేసుకుని మైహోం కంపెనీ యాజమాన్యం, ఒక్కసారిగా దిక్కు తోచని పరిస్థితిలో పడింది. ప్రభుత్వ అధికారుల అండదండలతో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దపెద్ద సిమెంట్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది. తీరా ప్రభుత్వంతో తెగదింపులు జరగడంతో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలకు గడ్డుకాలం ఏర్పడింది. నిర్మాణాలను నిలిపివేయాలని అధికార యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. దీంతో మైహోమ్ యాజమాన్యం భయం భయంగా నిర్మాణాలు చేపడుతుంది. ఏ క్షణం అధికారులు దాడులు చేస్తారా అంటూ భయం భయంగా రోజు వెళ్లబుచ్చుకుంటుంది.

*మేళ్లచెరువులో మైహోం ఆగమాగం..*

 

ప్రభుత్వ పెద్దలు అండదండలతో మొన్నటి వరకు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా పెట్టి, అనుభవించిన మైహోమ్ సిమెంట్స్ యాజమాన్యం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో వందల ఎకరాల్లో మై హోమ్ సిమెంట్ పరిశ్రమ ఉంది. మేళ్లచెరువు గ్రామపంచాయతీ పరిధిలో మైహోమ్ సిమెంట్స్ యాజమాన్యం నూతన సిమెంట్ ప్లాంట్ యూనిట్-4 ను రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంది. పర్యావరణ అనుమతులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులను ఆ సంస్థ ప్రారంభించింది. దీంతో అనుమతులు తీసుకోవాలని పలుమార్లు అధికార యంత్రాంగం నోటీసులు జారీ చేసింది.భూధాన్, ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేసింది.అధికారికంగా పనులు నిలిచిపోయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా అనధికారికంగా దొంగచాటున మైహోం సంస్థ నిర్మాణాలు చేపడుతుంది.ఎప్పుడు ఏ అధికారులు వచ్చి పనులు నిలిపివేస్తారన్న భయం భయంతో మైహోం సంస్థ ఆగమాగం అవుతుంది.అనుమతులు లేకుండా జరుగుతున్న పనుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితిఏందా అని బిక్కు బిక్కుమంటున్నారు. పనులు పూర్తిగా నిలిపివేస్తే కోట్లల్లో నష్టం తప్పదని పరిశ్రమ అంచనా వేస్తుంది. పనులు నిలిపివేయకుండా కిందిస్థాయి ఉద్యోగులను, కార్మికులను ఇబ్బందులు గురి చేస్తూ భయాందోళల నడమ నిర్మాణ పనులను మైహోం సంస్థ కొనసాగిస్తుంది.

 

*పరువు కోసం గేట్లు పీక్కున్న మైహోమ్ సంస్థ*

 

తప్పుఅని తెలిసి, అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను అధికారులు వచ్చి సీజ్ చేస్తే పరువు పోతుందన్న భయంతో మైహోం సంస్థ చిత్ర విచిత్రాలకు పాల్పడుతుంది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని, బుధవారం నాడు గేట్లకి తాళం వేసి సీజ్ చేస్తారన్న వేగుల సమాచారంతో మై హోం సంస్థ తన గేట్లను తానే పీక్కుంది. దాడులు నిర్వహించి అక్రమ నిర్మాణాలను సీజ్ చేసి తాళాలు వేస్తారన్న భయంతో, అధికారులు తాళాలు వేయకుండా అసలు గేట్ల లేకుండా చేసింది. భారీ క్రేన్లతో రాత్రికి రాత్రే మైహోమ్ యూనిట్-4 ప్రధాన ద్వారం గేటును తొలగించారు.విషయం తెలుసుకున్న స్థానికులు, అధికార యంత్రాంగం మైహోం తీరుతో నివ్వెర పోయారు.విచారణ నిమిత్తం గురువారం పరిశ్రమ వద్దకు వెళ్లిన మేళ్లచెరువు గ్రామపంచాయతీ అధికారులు మైహోమ్ తీరుపై ఉన్నతాధికారులకు నివేదించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పు అని హెచ్చరించారు. పనులు పూర్తిగా నిలిపివేసి, అనుమతులు తీసుకోవాలని మైహోమ్ సంస్థకు సూచించినట్లు పంచాయతీ కార్యదర్శి ఈర్ల నారాయణరెడ్డి తెలిపారు.