ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

రెడ్డిగూడెంలో అల్ముకున్న విషాద ఛాయలు..

మద్దిరాల జనవరి 19 నిజం న్యూస్

మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది….

రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు బెడిద సతీష్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు….

రోజు వారిగా పొలం దున్నుతుండగా బోల్తా కొట్టడంతో డ్రైవర్ సీట్లో ఉన్న సతీష్ అక్కడికక్కడే మృతిచెందాడు

స్థానికుల సమాచారం మేరకు ట్రాక్టర్ క్రింద పడి ఉన్న మృతుదేహాన్ని జెసిబి సహాయంతో బయటకు తీశారు మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సతీష్ అక్కడిక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు…