అన్న చేతిలో…. తమ్ముడు హతం

 

సూర్యాపేట ప్రతినిధి జనవరి 17 నిజం న్యూస్

సూర్యాపేట మండల బాలేంల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది….ఉప్పుల లింగయ్య S/o సైదులు (36) ను పెదనాన్న కుమారుడు ఉప్పుల సతీష్ కొడ్డలితో దారుణంగా హత్యచేశాడు .సోమవారం రాత్రి 9:30 సమయంలో పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్లిన లింగయ్య పై సతీష్ దాడి చేశాడు.

సతీష్ గొడ్డలితో తల,ఛాతీ భాగాల్లో బలంగా గాయాలు తగలడం తో లింగయ్య ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.

మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.గత కొంతకాలంగా వారి గొడవలు తరచూ జరుగుతూన్నట్టు స్థానికులు తెలియజేస్తున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.