రెడ్ బకెట్ బిర్యాని షాప్ ను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు

 

జోరుగా బిర్యాని సెంటర్లో నాణ్యతలేని చికెన్ వంటకాలు…

పట్టించుకోని యంత్రాంగం… అభాసు పాలవుతున్న ప్రజలు… క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేద ప్రజల డిమాండ్.

సూర్యాపేట ప్రతినిధి జనవరి 16 నిజం న్యూస్

సూర్యాపేట పట్టణంలోని రామలింగేశ్వర టాకీస్ రోడ్ నందు గల రెడ్ బకెట్ నందు గల ,రెడ్ బకెట్ నందు బిర్యానీ కొనుగోలు చేసిన సాయి రామ్ అనే ఓక కస్టమర్ బిర్యానీ తినే సరికే వాంతులు అవ్వడం తో దవాఖాన పాలయ్యారు. దీనితో అతని పిర్యాదు మేరకు కమీషనర్ శ పి.రామానుజుల రెడ్డి ఆదేశంల మేరకు ,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ,జనార్దన్ రెడ్డి మరియు సిబ్బంది కొండేటి వెంకన్న ,పిడమర్తి ప్రసాద్ ,రాజేష్ కలిసి షాప్ ను పరిశీలించగా, చికెన్ వాసన వొస్తుండటం తో షాపును సీజ్ చేయడం జరిగింది. నాణ్యత ప్రమాణాలు పాటించని బిర్యాని సెంటర్ లపై మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా సందర్శించి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేద ప్రజలు కోరుతున్నారు