మీకోసం మేమున్నాం! సేవా సమితి ఆధ్వర్యంలో.. ఆర్థిక సహాయం

*నిజం. దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన
చర్ల జనవరి 15 ( నిజం న్యూస్) మీకోసం మేమున్నాం సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో తేగడ గ్రామానికి చెందిన మడకం స్వరూప కుమారుడు మద్ది మనోజ్ కుమార్ ( 11) ఏడవ ఏట పోలియో కారణంగా అనుకోకుండా నడుము పడిపోయింది మనోజ్ కుమార్ తేగడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నా డు.
మడకం స్వరూప కాయ కష్టం చేసి తన కొడుకు వైద్య నిమిత్తం పెద్దపెద్ద ఆసుపత్రులకు తిప్పింది. మెరుగైన వైద్యం అందించలేని పరిస్థితి. ఆ పేద కుటుంబం దీనమైన గాధను నిజం దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించి మీకోసం మేమున్నాం.. సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆదివారం మడకం స్వరూప కు సర్పంచ్ అలవాల పార్వతీ చేతుల మీదుగా రూ 5వేల రూపాయల నగదు 12 వేల రూపాయల చెక్కును సభ్యులు అందజేశారు ఈ సందర్భంగా మీ కోసం మేమున్నాం సేవా సమితి అధ్యక్షులు నీలి ప్రకాష్ మాట్లాడుతూ మీకోసం మేమున్నాం సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా సమయంలోపలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు అనారోగ్యంతో గురైన కుటుంబాలకు మా వంతు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సొమ్మును వృధా చేయకుండా వైద్య నిమిత్తం వాడుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు మనోజ్ పూర్తిగా కోల్కొని మంచి స్థాయికి ఎదగాలని ఆ దేవున్ని కోరుకొంటున్నామ న్నారు ఈ కార్యక్రమంలో మీకోసం మేమున్నాం సేవాసమితి సభ్యులు నీలి నందు తాండవ రాయుడు దొడ్డి తాతారావు దొడ్డ ప్రభుదాసు ఎలమందల చక్రవర్తి గూబ సురేష్. తదితరులు పాల్గొన్నారు