Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజాస్వామ్యానికి పత్రికలు పట్టుగొమ్ములు.. తాసిల్దార్ భరణి బాబు సిఐ.బి అశోక్

నిజం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న తాసిల్దార్ భరణి బాబు.. సిఐ.బి అశోక్

చర్ల జనవరి 14 (నిజం న్యూస్) ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయని సమాజంలో నేడు నెలకొన్న పరిస్థితులపై పరిష్కారానికి పట్టు గొమ్ముల్లా నిలుస్తున్నాయని తహసిల్దార్ ఈ భరణి బాబు సిఐబి అశోక్ లు పేర్కొన్నారు ఈ సందర్భంగా శనివారం ఆయా కార్యాలయాల్లో నిజం న్యూస్ పత్రిక సంబంధించిన క్యాలెండర్ను తాసిల్దార్ని బాబు సిఐ.బి అశోక్ లు ఆవిష్కరించి ప్రసంగించారు

నేటి సమాజంలో ప్రజల సమస్యల పరిష్కారానికి పత్రికలు తమ వంతుగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు ప్రజా సమస్యల్ని ఎలిగెత్తి చాటుతూ విలేకరులు పోషిస్తున్న పాత్ర ఎనలేనిది అన్నారు జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారానికి దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు సమాజం సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిజం లో కొందరు తప్పుడు పోకడల వల్ల వారి వృత్తికి భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అని జర్నలిజం జనం కోసమే అనే ని కూడా సత్యాన్ని భాద్య తాహితమై విలేకరులు నిర్వర్తించడం అభినందనీయమని కొనియాడారు. మండలంలోని నిజం పత్రిక విలేకరి కే వెంకటేశ్వర్లు ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు అంద జేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొంగూరి రమణారావు దొడ్డ ప్రభుదాసు. శేషగిరి. స్థానిక ప్రముఖులు కొవ్వూరు వెంకటరమణ. తదితరులు పాల్గొన్నారు