మునుగోడు కి మహర్దశ తీసుకొస్తా :ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చండూరు, జనవరి 12, (నిజం న్యూస్),
మునుగోడు కి అధిక నిధులు కేటాయించి నియోజకవర్గంకు మహర్దశ తీసుకవస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం కోతులాపురం గ్రామంలో 68 లక్షల, చల్మెడ గ్రామంలో 55 లక్షల, వెల్మకన్నే గ్రామంలో 90 లక్షల, కల్వకుంట్ల గ్రామంలో 50 లక్షల, కొంపల్లి గ్రామంలో 55 లక్షల, చీకటిమామిడి గ్రామంలో 50 లక్షల, చోళ్ళేడు గ్రామంలో 60 లక్షల శంకుస్థాపన చేశారు. సీఎం కెసిఆర్ దీవెనలతో మరిన్ని నిధులను తెచ్చి సస్య శ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు