సాధన హై స్కూల్ విద్యార్థులు భోగి, సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరాలు

భువనగిరి ఇంఛార్జి జనవరి 12(నిజం న్యూస్)
పట్టణ కేంద్రంలోని సాధన హై స్కూల్ కరస్పాండెంట్, స్కూలు ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్దులకు పండగ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను గ్రామాల్లో ప్రజలు ఆనందంగా చేసుకునే పండగ సంబరాలను భోగి పండగై రోజున పని చేయని పాత ఉపయోగించని వస్తువులను, పాడైపోయిన వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. భోగి ఆచారంలో భాగంగా, ప్రజలు పొద్దున్నే స్నానం చేసి కొత్త సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ముగ్గులతో ఇంటిని అలంకరిస్తారు. గుమ్మడి పువ్వులను ఇళ్ల ముందు ముగ్గుల మధ్య గొబ్బెమ్మలుగా పేరుస్తారు. గొబ్బెమ్మ అనగా ఆవు పేడను ముగ్గుల మధ్య అలంకరించి ఉంచుతారు. అలంకరణపై మట్టి దీపాలను కూడా ఉంచవచ్చు. పొంగల్ మొదటి రోజున నిర్వహించబడే మరో ముఖ్యమైన సంప్రదాయం భోగి మంటలను వేసి, అందులో వేడినీటిని కాచుకొని స్నానం చేయడం ఆనవాయితీగా ఉంటుంది అని విద్యార్థులకు సంక్రాంతి పండుగ గురించి తెలిపారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి భోగి మంటలతో మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పండగ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పుట్టరవి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.