ఐ.ఎస్.ఎస్ ఫెసిలిటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.ఇంటర్వూలు

కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్..
భువనగిరి ఇంఛార్జి జనవరి 12(నిజం న్యూస్)
పట్టణ కేంద్రంలోని కృషి ఐటిఐ క్యాంపస్ లోని ఐ.ఎస్.ఎస్. ఫెసిలిటీ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించారు. ఈ సంధర్బంగా కృషి ఐటిఐ కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఖుషి ఐటిఐ అనే కళాశాలను స్థాపించిన సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్లలో మా విద్యార్థులు సత్తా చాటుతున్నారని తెలిపారు. కృషి ఐటిఐ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మా కృషి విద్యార్థులు కళాశాల నిర్వహించే ప్లేస్మెంట్లలో అందరూ సఫలీకృతులు కావాలని అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా కృషి కళాశాల లక్ష్యమని ఇప్పటి వరకు కృషి ఐటిఐ ఎన్నో కంపెనీల తోటి ఎం.ఓ.యు చేసుకున్నామని, ఐటిఐ కోర్స్ పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు కల్పించడంలో మా కృషి ముందుంటుందని తెలియజేశారు. గురువారం జరిగిన ఇంటర్వ్యు లో కూడా మొత్తం 54 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 43 మంది సెలెక్ట్ కావడం మాకు, కృషి ఐటిఐ కళాశాలకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఐ.ఎస్.ఎస్ ఫెసిలిటీ సర్వీసెస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ బద్దం నరేందర్ మాట్లాడుతూ నైపుణ్యం గల విద్యార్థులను వెతికి పట్టుకోవడం మా ఐ.ఎస్.ఎస్ ఫెసిలిటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ముఖ్య ఉద్దేశమని విద్యార్థులకు మూడు నెలల ట్రైనింగ్ తో వారిని ఇంకా నైపుణ్యవంతులను చేయాలని సంస్థ ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, కృషి ఐటిఐ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ , కృషి ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ నామోజు రమేష్ , శ్యామ్, నాగమలేష్, పాండు రంగం తది తరులు పాల్గొన్నారు