Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ముస్లింల పక్ష పాతి సీఎం కేసీఆర్

ముస్లిం లకు అండగా ఉంటాం

గత పాలక వర్గాలు ముస్లిం లను ఓటు బ్యాంకు గానే వాడుకున్నారు

ఈద్గాలకు,మసీదులకు నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కీ కృతజ్ఞతలు తెలిపిన ముస్లిం మైనార్టీ నాయకులు

కోదాడ ఈద్గాకు 20 లక్షలు , తమరబండ పాలెం కబ్రాస్థానంకు 5లక్షలు ఎమ్మెల్యే కోటా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

 

నిజం న్యూస్ కోదాడ జనవరి12

ముస్లింల పక్షపాతి సీఎం కేసీఆర్ అని కోదాడ , శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేట, తమరబండపాలెం ఈద్గాలకు ముస్లింలు ఎమ్మెల్యే కోదాడ ఈద్గాకు20 లక్ష లు, తమరబండ పాలెం కబ్రిస్తాన్ కు 5లక్షలు ఎమ్మెల్యే కోటా నుండి నిధులు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ… ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….. మైనార్టీల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తూ కృషి చేస్తుందన్నారు. విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు మైనారిటీ గురుకుల,పాఠశాలలు , కళాశాల లు స్థాపించి నాణ్యమైన ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తుంది అన్నారు. పేద ముస్లిం యువతుల వివాహానికి షాది ముబారక్ కింద 1,00,116/- కట్నకానుకులను ముఖ్యమంత్రి కెసిఆర్ మేనమామగా అందిస్తున్నానన్నారు. యువతకు ఉపాధి కల్పించేందు కు సబ్సిడీ రుణాలు అందించి ఆర్ధికంగా స్థిర పడేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. పూర్వ కాలం నుండి ఎంతో చరిత్ర కలిగిన ఉన్న మసీదు లు శిథిలావస్థకు చేరుకున్న దశ లో భారస ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరు చేసి వాటిని భవిష్యత్ తరాలకు పదిలంగా వుంచిందన్నారు.ఈద్గాలు ముస్లిం లకు పవిత్ర స్థలాలు గా గుర్తించి వాటి అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు. అందరితో పాటు ఫించన్లు,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,రైతు బంధు, భీమా వంటి పథకాల తో పాటు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారస ప్రభుత్వం అన్నారు. గత పాలకులు ముస్లిం లను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్పా వారి అభివృద్ధికి చేసింది ఏమి లేదన్నారు. ముస్లింలు సీఎం కేసీఆర్ వెంట నడువాలన్నారు. పలువురు ముస్లింలు మాట్లాడుతూ బొల్లం మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ఈద్గాలకు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే కు ముస్లిం లు రుణ పడి ఉంటామన్నారు. మైనార్టీ లను గుర్తించిన ఎమ్మెల్యే బొల్లం ఒక్కరే అన్నారు. మైనార్టీలంతా ఎమ్మెల్యే వెంట నడ వాలన్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్, అబ్దుల్ ఖాదర్,
మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, నయముద్దీన్, ఖాజా మొయినుద్దీన్, ఖదీర్ పాషా, ఎస్.కె మదర్, షఫీ, సాదిక్, తాజ్, మేరా,మజార్, మత పెద్దలు , తమరబండపాలెం ముస్లిం మైనార్టీ నాయకులు,తదితర నాయకులు పాల్గొన్నారు.