Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నదిచగి శివ గౌడ్ హత్య కేసులో 5 ముద్దాయిలు అరెస్ట్

కౌతాళం జనవరి 12 నిజం న్యూస్

ఈ నెల 07 వ తేదీన కౌతాలం మండలం లోని పాత కుంబలనూర్ గ్రామ శివారున జరిగిన ఈడిగ శివకుమార్ గౌడ్ హత్య కేసులోని ఈ కింద తెల్పిన ముద్దాయిలను గురువారం కౌతాలం మండలం లోని హాల్వి గ్రామ ఆర్చి వద్ద అరెస్ట్ చేయడమైనది.
ముద్దాయిల వివరములు
రామన్నగారి బసన్న గౌడ్ @ R.బసవన్న గౌడ వయస్సు 47 సం!!రాలు ., తండ్రి లేట్ హనుమంత గౌడ్
హరిజన దేవన్న @ మాదిగ దేవన్న వయస్సు 53 సం!!రాలు., తండ్రి దుర్గప్ప,హరిజన రాము @ రామ, వయస్సు 28 సం!!రాలు.,తండ్రి దేవన్న హరిజన ముదియప్ప @ మాదిగ ముదుక, వయస్సు 24 సం!!రాలు.,తండ్రి దేవన్న
రామన్నగారి రామన్న గౌడ వయస్సు 54 సం!!లు.,తండ్రి లేట్ హనుమంత గౌడ
అందరిదీ నదిచాగి గ్రామము, కౌతాళం మండలము.
వివరాల లోకి వెళ్తే , కౌతాళం మండలము నదిచాగి గ్రామానికి చెందిన రామన్నగారి రామన్న గౌడ్ గ్రామములొ రాజకీయముగా ఉంటూ ప్రస్తుతము ఒక ప్రధాన పార్టీలో కొనసాగుతున్నాడు. అదే విధంగా అదే గ్రామానికి చెందిన ఈడిగ శివ కుమార్ గౌడ్ కూడా అతని అనుచరుడిగా ఉంటూ రాజకీయముగా తిరుగుతూ ఉండేవాడు. అయితే వారు ఇరువురు ఇంకా కొంతమందితో కలసి 2015 సం!!రంలో పొలము విషయములో అదే గ్రామానికి చెందిన డీలర్ ఈరన్న ను చంపిన కేసులో ముద్ధాయిలు గా ఉండినారు.తదుపరి ఈ కేసును పెద్ద మనుషులతో మాట్లాడుకొని ఈ కేసును రాజీ అయ్యేందుకు కొంత మొత్తం డబ్బులు ఒప్పందం కుదుర్చుకొని అందులో సగ భాగం రామన్న గౌడ్, మిగితా సగ భాగం మిగిలిన ముద్దాయిలు భరించేటట్లు మాట్లాడుకుని కేసును రాజీ చేసుకున్నారు. ఈ విషయం లోనే రామన్న గౌడ్ కు మరియు ఈడిగ శివకుమార్ గౌడ్ కు మనస్పర్తలు వచ్చి రాజకీయంగానూ మరియు వ్యక్తిగతం గానూ కక్ష పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే 2020 వ సం.రం లో రామన్న గౌడ్ అనుచరుడైన దేవన్న పై ఈడిగ శివ కుమార్ గౌడ్ కత్తితో దాడి చేసీన ఘటన లో కౌతాలం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కావడంతో వారి మధ్య కక్ష్యలు మరింత తారాస్థాయికి చేరి దీనికి అంతటికీ కారణం రామన్న గౌడ్ అనే, శివ కుమార్ భావించి దాంతో ఎలాగైనా రామన్న గౌడ్ ను హత్య చేయాలని 2021 సం. నవంబర్ నెల లో కర్ణాటక రాష్ట్రం, సిరుగుప్ప తాలూకా లోని హచ్చోల్లి పోలీసు స్టేషన్ పరిది లో రామన్న గౌడ్ వాహనం పై దాడి చేయగా ఆ రోజు అదృష్టవ శాత్తూ రామన్న గౌడ్ బదులు అతని తమ్ముడు అయిన బసన్న గౌడ్ ఉండగా అతనని కొట్టి వదిలి పెట్టడం తో అక్కడ శివ కుమార్ మరియు కొందరి పై హత్యా యత్నం కేసు నమోదు అయినది. తిరిగి మరోసారి 2022 సంవత్సరం జూన్ నెలలో శివ కుమార్ కర్ణాటక రాష్ట్రం,రాయచూరు జిల్లా మాన్వి టౌన్ కు చెందిన సుఫారి గ్యాంగ్ తో మాట్లాడుకొని రామన్న గౌడ్ ను మరియొక సారి హత్య చేయుటకు పథకం పన్నుచుండగా,అపుడు కౌతాలం ఎస్ ఐ నరేంద్రకుమార్ రెడ్డి వారి సిబ్బందితో చాక చక్యంగా పట్టుకొని ఆ గ్యాంగ్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడమైనది.
తర్వాత రాజకీయంగా ఇరువురూ సదరు ఒకే పార్టీ లో ఇమడలేక శివకుమార్ గౌడ్ 2022 సం.లోని ఆగస్ట్ నెలలో మరొక పార్టీ లోకి చేరినాడు. అప్పటి నుండి రామన్న గౌడ్ మరియు శివ కుమార్ గౌడ్ లకు పోలీసు వారు కౌన్సిలింగ్ చేసి గ్రామంలో పోలీసు పికెట్ నిర్వహిస్తూ వారి మీద నిఘా ఉంచడమైనది.రామన్న గౌడ్ మరియు శివ కుమార్ గౌడ్ లు ఎవరికి వారు జాగ్రతగా ఉంటూ ఉండివారు.అప్పటికే రెండు సార్లు రామన్న గౌడ్ మీద శివ కుమార్ గౌడ్ హత్య కు ప్రయత్నం చేసి నందున శివ కుమార్ మీద నమ్మకం లేక తనకి ప్రాణ హాని ఉందని భావించి,ఈ నెల 03 వ తేదీన రామన్న గౌడ్ అతని తమ్ముడైన బసన్న గౌడ్ మరియు అతని అనుచరుడు అయిన దేవన్న మరియు అతని కొడుకులు రాముడు, ముదియప్పలతో కలసి రామన్న గౌడ్ ఇంటి వద్ద చర్చించుకొని పథకం పన్ని గ్రామంలో పోలీసు పికెట్ ఉన్నందున పక్క గ్రామం అయిన పాత కుంబలనూర్ లో ఉన్న శివ కుమార్ కల్లుపెంట వద్ద ఒకడే ఉంటాడనీ అక్కడైతే హత్య చేయడానికి అనువుగా ఉంటుందనీ అనుకున్న ప్రకారం ఈ నెల 07 వ తేదీన సాయంత్రం సుమారు 06.30 గంటలకు శివ కుమార్ గౌడ్ పై మూకుమ్మడిగా దాడి చేసి కళ్ళలో కారం పొడి కొట్టి వేట కొడవళ్ళతో అతికిరాతకంగా నరికి చంపి కర్ణాటక రాష్ట్రం మాన్వి వైపు పై తెలిపిన ముద్దాయిలూ పారిపోయినారు.
గురువారం జనవరి 12 వ తేదీ ముద్దాయిలు కర్ణాటక రాష్ట్రం మాన్వి వైపు నుండి ఈ కేసు బెయిల్ నిమిత్తము ఆదోని కి లాయరును కలవడానికి వస్తుండగా ఆదోని డి‌ఎస్‌పి శవినోద్ కుమార్ గారి ఆద్వర్యం లో కోసిగి సిఐ ఎరిసావలి,ఎస్సైలు కౌతాలం,కోసిగి మరియు పెద్దకడుబూరు మరియు వారి సిబ్బంది తో కలసి ముద్దాయిలను పట్టుకొని వారి వద్ద నుంచి కేసులో ఉపయోగించిన 02 మోటార్ సైకల్లు 03 వేట కొడవళ్ళను మరియు 02 సెల్ ఫోన్ లను స్వదీన పరుచుకోవడం జరిగింది.
ఇంత త్వరగా ఈ కేసును చేధించినందుకు గాను కర్నూల్ జిల్లా ఎస్ పి సిద్దార్థ కౌశల్ మరియు ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ సిఐ ఏరిష వలి కోసిగి మరియు ఎస్ ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, కౌతాళం పోలీసు శ్రీనివాసులు పెద్దకడుపూర్ పోలీసు రాజా రెడ్డి కోసిగి పోలీసు మరియు సిబ్బంది ని అభినందించారు.