నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్ తుపాకుల

ముదిగొండ మండలం జనవరి 12(నిజం న్యూస్):-
ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిస్టాపురం గ్రామంలో ఖమ్మం, మధిర,పాలేరు నియోజకవర్గ స్థాయి (“నవీన్ ప్రీమియర్ లీగ్”) జ్ఞాపకార్ధంగా కబడ్డీ పోటీలను ముదిగొండ మండల సొసైటీ చైర్మన్ తుపాకుల ఎలగొండ స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రథమ బహుమతి 10,016/- (తుపాకుల ఎలగొండస్వామి), ద్వితీయ బహుమతి 7,016/-(దమ్మాలపాటి మార్క్స్), తృతీయ బహుమతి 5,016/- (నీరుకొండ సతీష్ – భారత రాష్ట్ర సమితి గ్రామ అధ్యక్షుడు), చతుర్ధ బహుమతి 3,016/- (గుంపుల వర్ధన్ ఆర్.ఎం .పీ) అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు గురువారం నుంచి శనివారం వరకు జరుగుతాయి అని అన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చాలా కృషి చేసిందన్నారు..సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదన్నారు.