విజయ సంకల్పయాత్రతో టీడీపీకి భయం పట్టుకుంది

▪మంచి చేసాం కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వస్తున్నాం
▪ప్రతిపక్ష పార్టీలు, ఎల్లోమీడియా ఏకమై వచ్చినా జగన్ ఆపలేరు
▪ఓట్ల తొలగింపులో తమ ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయాలకు దూరం
▪దీనిపై పయ్యావుల కేశవ్ బహిరంగ చర్చకు సిద్ధమా
▪విశ్వన్న గెలుపు కోసం సైనికుల్లా పని చేయండి
-లత్తవరం తాండా బహిరంగ సభలో యువనేత వై.ప్రణయ్ రెడ్డి.
ఉరవకొండ జనవరి 12 నిజం న్యూస్ :-
నియోజకవర్గంలో తాను చేపట్టిన విజయ సంకల్ప యాత్రతో పయ్యావుల కేశవ్ లో వణుకు మొదలైందని ఆ పార్టీ నాయకులకు భయం పట్టుకుందని ప్రజలు తమను ఎక్కడ మరిచిపోతారేమోనని భయపడుతున్నారని వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై. ప్రణయ్ రెడ్డి వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గెలుపే లక్ష్యంగా ఆయన తనయుడు, వైస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వై. ప్రణయ్ రెడ్డి చేపట్టిన ‘విజయ సంకల్పయాత్ర’ గురువారం మండలంలోని లత్తవరం తాండా గ్రామంలో జరిగింది. ముందుగా ఉరవకొండ నుంచి వందలాది మందితో లత్తవరం తాండాకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు. సందర్భంగా గ్రామస్తులు ప్రణయ్ రెడ్డి, గిరిజమ్మ గిరిజన సంప్రదాయంతో ఘనస్వాగతం పలికారు.గజమాలలతో సత్కరించారు.ప్రజలకు అభివాదం చెబుతూ రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఓర్వలేని టిడిపి నేతలు, ఎల్లో మీడియా నిత్యం ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా గెలవడం చేతకాక పవన్ కళ్యాణ్ తో సమావేశం అవుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను జంట ప్రేమికులుగా ఆయన అభివర్ణించారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాకుండా రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా ఏకమై వచ్చినా ప్రజాబలం ఉన్న జగన్ గెలుపును ఆపలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదే విదంగా మరోసారి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై ఆయన విరుచుకుపడ్డారు.ఉరవకొండ నియోజకవర్గ ప్రజలను నిలువెల్లా మోసం ఘనత కేశవ్ కే దక్కిందన్నారు.నాడు ఎన్నికల్లో గెలుపు కోసం పట్టణ ప్రజలకు దొంగ పట్టాలు పంచిన ఘనుడు కేశవ్ అని అన్నారు.అదే విదంగా తన సొంత గ్రామమైన కౌకుంట్లలో కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు పేకాట క్లబ్ వంటివి నడిపిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతూ తాడిపత్రికి చెందిన ఓ కుటుంబం చావుకు కూడా కారణమయ్యారని ఆరోపించారు.ఆ కుటుంబ ఉసురు ఎదో ఒక రోజు వీళ్లకు తగలక తప్పదన్నారు.ఇలా ఎందరో ఉసురు పోసుకున్న వీళ్ళు రోజు మైకులు పట్టుకుని నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.నియోజకవర్గంలో టిడిపి వాళ్లకు చెందిన 6 వేల ఓట్లు తొలగించారంటూ నాపై ఢిల్లీకి కేశవ్ తప్పుడు ఫిర్యాదు చేశాడన్నారు.ఆ పిర్యాదు పై నిలిచే దమ్ము నీకుందా అని ప్రశ్నించారు.పయ్యావులకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నేను బిఎల్వోలతో సమావేశమైనట్టు ఫోటోలు గాని వీడియోలు గాని ఇతర ఆధారాలు చూపిస్తే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ఈ సవాల్ కు నీవు సిద్ధమా కేశవ్ అని అన్నారు. నేను చేసిన ఆరోపణలు నిజం కాకపోతే నేనంటే మీకు భయం లేకపోతే నీ అనుచరులతో ప్రెస్మీట్లు పెట్టించకుండా నువ్వే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక వచ్చే ఎన్నికల్లో మన నాయకులు విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు,నాయకులు, లత్తవరం తాండా సర్పంచ్ అన్నపూర్ణ, ఎంపిటిసి చిట్టెమ్మ, నాయకులు నాగరాజు నాయక్, ప్రసాద్ నాయక్, వెంకటేష్ నాయక్, వెంకటా నాయక్, లక్ష్మన్న నాయక్, అంజి నాయక్, కాంతా నాయక్, తులసి నాయక్, భరత్ నాయక్, ఎర్రిస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.