ఉప సర్పంచ్ పై కత్తులతో దాడి

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జనవరి 12 (నిజం న్యూస్)
ఇచ్చోడ మండల కేంద్రంలో గురువారం నాడు సిరిచెల్మా గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అబ్దుల్ అజీం పై దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది మండలంలోని అధికార పార్టీకి చెందిన సిరిచేల్మా గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్ కేశవపట్నం గ్రామానికి చెందిన రైతుబంధు మండల అధ్యక్షులు ముస్తఫా కు వారం రోజుల క్రితం ఒక సంఘటనలో ఇద్దరు బి ఆర్ ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఆ చిన్నపాటి గొడవ చినికి చినికి గాలివానగా మారి నేడు దాడికి దారి తీసింది
ఇచ్చోడలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఓ హోటల్లో అబ్దుల్ ఉన్నప్పుడు తనపై కేశవపట్నం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి రైతుబంధు మండల అధ్యక్షులు కత్తులతో దాడి చేయించారని ఉప సర్పంచ్ అన్నారు. దాడి విషయంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.