Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్మార్ట్ బైక్ ను కనుగొన్న విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ

ప్రతి ఒక్కరికి మోటార్ వెహికల్ యాక్ట్ నియమ, నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి, తప్పకుండా వాటిని పాటించాలి.

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో జనవరి 11 (నిజం న్యూస్)
ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బైక్ ప్రమాదాలే ఉంటున్నాయి. స్పీడ్ గా వెల్లడం.. తాగి డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం జరిగితే బైక్ నడిపిన వ్యక్తికి హెల్మెట్ లేక పోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు విద్యార్థులు స్మార్ట్ బైక్ తయారు చేసి వారి సృజనాత్మకతను వెలికి తీశారు. ఒకవేల ఎవరైన ఈ స్మార్ట్ బైక్ పై వెళ్లాలనుకుంటే హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకుంటే బైక్ స్టార్ట్ కాదు.. ఒక వేళ తాగి నడుపుదామన్న మధ్యలోనే ఆగిపోతుంది.. ఇలా ఎంతో టెక్నాలజీతో స్మార్ట్ బైక్ తయారు చేసిన విద్యార్థులను జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్., అభినంధించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… సాధారణంగా హెల్మెట్ లేకుండా సాధారణ బైక్ స్టార్ట్ అవుతుంది కానీ స్మార్ట్ బైక్ మాత్రం హెల్మెట్ ధరించిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు వాహనదారులు హెల్మెట్ ధరించి ఉంటే బైక్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది దీని కోసం రిసీవర్లు మరియు ట్రాన్స్‌మిటర్‌ని ఉపయోగించరు. తప్పనిసరి హెల్మెట్‌, ర్యాష్‌ బైక్‌ రైడింగ్‌పై ప్రభుత్వం చొరవ తీసుకుంది .విశ్లేషణ ప్రకారం, ప్రతిపాదిత సిస్టమ్ స్మార్ట్ హెల్మెట్‌తో కూడిన “స్మార్ట్ బైక్”ని అందిస్తుంది ఇది వేగం నియంత్రణలో ఉందో, రైడర్ హెల్మెట్ ధరించాడో లేదో గుర్తిస్తుంది. మరియు మద్యం తాగి నడపడం వల్ల హెల్మెట్ పెట్టుకున్న బైక్ ఆటోమెటిగ్గా 15 సెకన్లకు ఆగిపోతుంది, హెల్మెట్ తీయడం వల్ల ఆగిపోతుంది, అదే విధంగా ఇందులో kye పెట్టి ఆన్ చేసిన బైక్ స్టార్ట్ అవ్వదు హెల్మెట్ ధరిస్తేనే స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మోటార్ వెహికల్ యాక్ట్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, అలా ట్రాఫిక్ నియమాలను పాటించినప్పుడే అందరూ క్షేమంగా తమ గమ్యాలను చేరుకుంటారని, తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం ఇవ్వడం చేయకూడదని, త్రిబుల్ రైడింగ్, రాంగ్ సైడ్ వెహికల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం లాంటివి చేయకూడదని, హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని మరియు సీట్ బెల్టు ధరించి వాహనం నడపాలని తెలిపారు.