అరభిందో సంస్థ ప్రతినిధుల సందర్శన

ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 11(నిజం న్యూస్)జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ (ZIIEI) అరబిందో సంస్థ & (హెచ్డీఫ్సీ) వారి ఆధ్వర్యంలో ఇటీవల రోల్ మాడల్ పాఠశాల గా ఎంపికైన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ధన్నుర్ (బి ), మండలం బోథ్, పాఠశాలను అరబిందో సంస్థ సభ్యులు పసుపులేటి గణపతి బుధవారం నాడు హైదరాబాద్ నుండి వచ్చి పాఠశాలను సందర్శించారు. జడ్ఐఐఇఐ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఉపాద్యాయుడు బైరి సతీష్ కుమార్ ని పాఠశాలకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులను విషయాల వారిగా పలు ప్రశ్నలను అడిగి ఉపాధ్యాయులు బోదిస్తున్న తీరును, వినూత్న రీతిలో పాఠ్య భోదన, డిజిటల్ తరగతుల బోధనను చూసి ఆయన అభినందించారు. తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ వైద్య, అమరేందర్, ధనుంజయ్, ప్రశాంత్ కుమార్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.