ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొపెసర్ హైమాన్ డార్ప్ భేట్టి ఎలిజబేత్ దంపతుల 36వ వర్దంతి

అదిలాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 11 (నిజం న్యూస్) అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్ పిట్టల వాడ యందు
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ హేమన్ డార్ఫ్ బేట్టి ఎలిజబెత్ దంపతుల 36వ వర్ధంతిని
ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు
అడవి బిడ్డల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి తమ జీవితాన్ని ధారపోసి ఆదివాసిల గుండేలలో శాశ్వతంగా నిలిచిపోయిన మహా మనిషి ప్రొఫెసర్ హైమన్ డార్ప్ వీరు ఆస్ట్రేలియా దేశంలోని వియాన్నా నగరంలో 1909 జులై మాసంలో జన్మించారు 1930లో లండన్ విశ్వవిద్యాలయంలో మానవ పరిణామ శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొంది నేపాల్ ఫిలీఫ్ఫిన్స్ భారతదేశంలో ఆదివాసుల జీవన విధివిధానాలను అధ్యయనం చేశారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న ఆదివాసీలపై పలు పరిశోధనలు చేశారు నాగరిక సమాజానికి దూరంగా జీవితాలు గడుపుతున్న ఆదివాసులను చూసి ప్రొఫెసర్ హైమన్ డార్ప్ హృదయం చెల్లించింది ఆర్థికంగా సామాజికంగా సంస్కృతికంగా వెనుకబడిన 9 తెగలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని సంకల్పించారు ఆదివాసులకు విద్యా లేక బయటి ప్రపంచం విషయాలు తెలియక అభివృద్ధికి ఆమడా దూరంలో ఉండడం ఇతరుల మోసాలు నమ్మకం ద్రోహం పసిగట్ట లేకపోవడం ప్రభుత్వ పథకాలు తెలియకపోవడం వలసవాదులు చేతిలో మోసలుపోవడం గురి కావడం ఆధునిక వ్యవసాయం తెలియక అడవి సంపద మీద ఆధారపడి పోతున్న నమ్మి జీవించడం సంఘజీవులుగా సమిష్టి ఆచారాలతో జీవించేవారు ప్రకృతిని జల జీవరాసులను దైవంగా పూజించడం మనిషికి మనిషిగా గౌరవించడం తప్ప మోసం చేయడం తెలియని మానవతావాదులు ఆదివాసులు అని హైమన్ డార్ప్ నమ్మడం ప్రత్యక్షంగా అయినా కృషి వల్ల నాడు నేడు ఆదివాసి గుడలలో విద్యా కేంద్రాలు ఏర్పడి విద్యావంతులైనారు మా ఆదివాసి ప్రాంత రక్షణకై ఆస్తిత్వం చట్టాలు వచ్చినాయి మా ప్రాంతం మాకే దక్కాలని మా ఊళ్లో మా రాజ్యం కావాలని నేటికీ పోరాటాలు చేస్తున్నారు 1940 తెలంగాణ ప్రాంతం నైజాం నవాబు పాలనలో ఉండి ఆనాటి వ్యాపారులు పట్వారిలు గ్రామా అధికారులు అటవి అధికారులు పోలీస్ శాఖ అధికారుల ఆదివాసులపై దౌర్జన్యలు జమీందారుల పెత్తనం వలస వాసులు పై తిరుగుబాటు ప్రకటించారు జోడేఘాట్ అడవి ప్రాంతంలో కొమురం భీం ఆధ్వర్యంలో నిజాం సైనికులకు గొండులకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కుంరాం భీం అశువులు భాసరు ఆదివాసుల తిరుగుబాటులకు గల కారణాలు పరీక్షించడానికి బ్రిటీష్ ప్రభుత్వం నైజాం ప్రభుత్వ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ను
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పంపింది అయినా తన సతీమణితో జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామానికి వచ్చి స్థిర పడ్డారు సుమారు 12 సంవత్సరాలు పాటు ఆదివాసులతో ఆదివాసుడై వారి జీవితాలను సారాని తెలుసుకున్నారు గడ్డి గుడిసెలో నివసిస్తూ గోండు భాష అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారు ఆదివాసుల జీవితాలను వారి మధ్య తిరిగి వారిలో ఒకరిగా మెలగారు. ఈ విధంగా డార్ప్ కుటుంబానికి గోండు సమాజానికి సంబంధాలు ఏర్పడింది ఆదివాసీల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపేవారు ఆదివాసుల అభివృద్ధికై సూచనలు చేయడమే గాక ఆదివాసి అభివృద్ధికై అనేక ప్రామాణిక గ్రంథాలు రాశారు ది గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అను గ్రంతంలో ఆదివాసుల జీవన విధానము వారి సంస్కృతి సాంప్రదాయాలను వివరించారు పరిశోధన చేసి సూచనలు విషయాలు ముఖ్యంగా ఆదివాసులకు భూములు అడవి పై మరియు నీటిపై పూర్తి అధికారము ఉండాలని ఉన్నత విద్యా శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సంక్షేమ పథకాలు నేరుగా అందించాలని ఆదివాసులను విన్నపాలను అక్కడికక్కడే పరిష్కారం చేయుటకు జోడేఘాట్ మరియు కేస్లాపూర్ జాతరలో దర్బార్ లు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వాలకు నివేదిక ద్వారా సూచించారు ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడానికి గోండు భాష పరీక్షించడానికి ఆదివాసులు న్యాయస్థానాలైనా గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్లను అభివృద్ధి చేయాలని ఆదివాసులు కాస్తు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసులు హక్కులను చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఇతర కులాలను చేర్చినచో ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాలు ఇచ్చినమైపోయి ఆదివాసులు మనగాడా ప్రమాదం ఏర్పడుతుంది ఆదివాసుల సమగ్ర అభివృద్ధి కి కృషి చేయాలని అనేక సూచనలు సిఫార్సులు చేయడమైంది కానీ అనే ప్రభుత్వాలు హైమన్ డార్ప్ సూచనలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం ఆదివాసులు అప్పటి నుండి ఇప్పటివరకు అనేక రూపాలు హక్కులు చట్టాలు అమలు కోసం మరియు మనుగడ కోసం ఆదివాసులు నేటికీ ఉద్యమిస్తూనే ఉన్నారు భారత రాజ్యాంగంలోని ఆదివాసి ప్రాంత ప్రత్యేకతను అయిదవ షెడ్యూల్ ఏజెన్సీ రక్షణ చట్టాలు ఉన్న అధికారులు అమలు చేయక నిర్లక్ష్యం అవినీతితో ఆది వాసులకు అందలేకపోతున్నాయి ఎంతోమంది ఆదివాసీలు రక్తలు చిందించి ప్రాణాలు అర్పించిన హక్కులను 1 ,70 ఎల్.టి.ఆర్ అడవి హక్కుల చట్టం ఫేసా చట్టం లాంటి అమ్ములు నోచుకోకపోవడం ఏజెన్సీ స్థానిక ఉద్యోగలు జీవో నెంబర్ సుప్రీంకోర్టు కొట్టు వేసి నది దీనితో ఆదివాసీలు దీని స్థితిలో పడిపోయినారు జీవో నెంబర్ 3 యధావిధిగా కొనసాగించాలని ఏజెన్సీ ఆదివాసులు పల్లెలను పోరాటం చేసిన ఫలితం దక్కలేదు వలసవాదులు దోచుకోవడానికి మార్గం సుఖము అయినది ఉద్యోగాలతో పాటు అడవి వ్యవసాయ భూములు దళాలను చేతులకు పోయి రియల్ ఎస్టేట్ రూపంలో మోసాలకు బలి అవుతున్నాయి వీరికి తోడు అడవి శాఖ అధికారులు ఆక్రమ కేసులు పెట్టి జైలుకు పంపు ఆదివాసి ప్రాంతానికి భయ ప్రాంతాల గురిచేసి అలజడు చేస్తున్నారు ఏజెన్సీ ఆదివాసుల సంపద వలన వలసవాదులు భూకబ్జాదారులు పరంగా మారింది కొమరం భీం చూపిన బాటలో జల్ జంగల్ జమీన్ కై ఉద్యమం స్ఫూర్తితో పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆదివాసులు సమగ్ర అభివృద్ధి కోసం ఆదివాసులు ఆదివాసిగా జీవించిన బెట్టి ఎలిజబెత్ హైమాన్ డార్ప్ దంపతులకు ఆదివాసులకు ఆత్మబంధువు ఆదర్శమూర్తులు ఆదివాసులతో వెలుగు నింపిన మాతృదేశాన్ని వదిలి కాలినడక నా వందల మైళ్ళు సంచరించి ఆదివాసి గుడిలో స్థిర స్థాయిగా గుర్తుండి పోయే విధంగా సేవ చేస్తూ పూర్తి గా గొండి ధర్మ ఆచారాలు పాటిస్తూ మరణించిన మహా మనిషి ఆదివాసి ఆత్మబంధువులైన హైమన్ డార్ప్ భేట్టి ఎలిజిభేత్ కు
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరుపున ఘనంగా నివాళ్ళు అర్పించారు
గోడం గణేష్
తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు,
ఉయిక సంజీవ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
వెట్టి మనోజ్
జిల్లా ప్రచార కార్యదర్శి,
సలాం వరుణ్
ఆదివాసీ
విద్యార్థి సంగం జిల్లా ఉపాధ్యక్షుడు,
బి,రాహుల్,వేడ్మ ముకుంద్ మరియు ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు