ప్లయింగ్ స్కాడ్ బృందంపై విద్యార్థులు దాడి

ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 11(నిజంన్యూస్) ఇచ్చోడ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా తనిఖీలు చేయడానికి వచ్చిన ప్లయింగ్ స్కాడ్ బృందంపై విద్యార్థులు దాడి చేసిన ఘటన జిల్లాలో సంచలన రేపుతుంది కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు గత కొన్ని రోజుల నుండి సెమిస్టర్ పరీక్షలు నడుస్తున్నాయి బోథ్ నియోజకవర్గంలోని బోథ్ నేరడిగొండ. ఇచ్చోడ లలోని డిగ్రీ కళాశాలలో మాస్ కాపీయింగ్ నడుస్తుంది..? తమ కళాశాల రిజల్ట్ ను చూపెట్టుకోవడం కోసం ఈ మాస్ కాపీయింగ్ కు కళాశాల యజమాన్యాలు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని డిగ్రీ పరీక్ష కేంద్రాలైన వివేకానంద చత్రపతి సాయి సమంత్ కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పరీక్షల్లో జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ మాస్ కాపీయింగ్ ను అరికట్టడం కోసం బుధవారం ప్లయింగ్ స్కాడ్ బృందం మండల కేంద్రంలోని సాయి సమంత్ కళాశాలలో డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాలపడిన 12 మంది విద్యార్థులను బుక్ చేశారు అనంతరం వివేకానంద డిగ్రీ కళాశాలలో ప్లయింగ్ స్కాడ్ బృందం తనిఖీలు నిర్వహించాగా మాస్ కాపీయింగ్ పాల్పడుతున్న విద్యార్థులను డిపార్ చేశారు విద్యార్థులు డిమాండ్ చేయడంతో విద్యార్థుల ఆగ్రహించి ప్లయింగ్ స్కాడ్ బృందంపై దాడి చేసి బృందం యొక్క కారును ధ్వసం చేశారు దాని వెనుక మండలంలోని కొన్ని కళాశాల యజమాన్యాలు హస్తముందని ఆరోపణలు వినిపిస్తున్నాయి