రబింద్ర పాఠశాలలో సంక్రాంతి సంబురాలు

ముధోల్ నియోజకవర్గం ఇంచార్జి జనవరి 11 (నిజం న్యూస్)
ముధోల్ మండల కేంద్రంలోని రబింద్ర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. కొందరు విద్యార్థులు హరిదాసులు, గంగిరెద్దుల మొదలగు వేషాలలో వచ్చి అందరిని అలరించారు. కోలాటం, సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సాయినాథ్ మాట్లాడుతూ, సంక్రాంతి అంటే కొత్త వెలుగు అని, సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తాడని, మకర రాశిలో
ప్రవేశించడం వల్ల, మకర సంక్రాంతి అంటారని, పంటలు చేతికి వచ్చి, అందరిలో ఆనందం కలుగుతుందని,ఇది మూడు రోజుల పండుగగా బొగి, కనుమ, సంక్రాంతిగా జరుపుకుంటామని రకరకాల రంగులతో, రంగవల్లులు దిద్ది వాకిలిని అలంకరిస్తారని, పిల్లలకు భోగి పండ్లు పోస్తారని, ఓ పాత వస్తువులను కాల్చి భోగి మంటలు వేస్తారని, ఈ పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు
తేవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమములో పాఠశాల కరస్పాండెంట్ రాజేంధర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీం రావ్ దేశాయి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.