2023-24 సంవత్సరానికి పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

*అన్ని శాఖల నిధులను పరిగణలోకి తీసుకోవాలి–డిఎల్ పిఓ
ముధోల్ నియోజకవర్గం ఇంచార్జి జనవరి 11 (నిజం న్యూస్)
ముధోల్ మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో బుధవారం గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2023- 24 సంవత్సరానికి సంబంధించిన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై పంచాయతీ కార్యదర్శులు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు డిఎల్పిఓ శివకృష్ణ శిక్షణ ఇచ్చారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీకి గ్రామంలో ఖర్చు చేయాల్సిన అన్ని శాఖల నిధులను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను గ్రామసభలో ఆమోదించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు, ముధోల్, బాసర మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఏపిఎం అశోక్, ఐసిడిఎస్ సూపర్వైజర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్. రాజేష్, ఏవో అజ్మీర భాస్కర్, తదితరులు, పాల్గొన్నారు.