“నిజం” న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ముదిగొండ మండలం జనవరి (నిజం న్యూస్) 11:-
ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిస్టాపురం ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ శాసన సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరియు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ ఎమ్మెల్యే, సీడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, స్థానిక పార్టీ నాయకుల తో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్బంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ నిజాలని నిర్భయంగా రాస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రజాదారణ పొందిన పేపర్ నిజం పేపర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో
ఎంపీపీ సామినేని హరిప్రసాద్, భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మా రెడ్డి,ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు గౌడ్,ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల ఎలగొండ స్వామి, మేడేపల్లి సొసైటీ చైర్మన్ సామినేని వెంకటేశ్వరరావు,మండల రైతు సమన్వయ అధ్యక్షులు పోట్ల ప్రసాద్,నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల వీరారెడ్డి, పాము సిల్వరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చెరుకుపల్లి బిక్షం, బీసీ సెల్ మండల అధ్యక్షులు తోట ధర్మా, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఖాజా, మాజీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మీగడ శ్రీనివాస్, బంక మల్లయ్య, మహిళా అధ్యక్షురాలు ప్రమీలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు