Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం భారత రాష్ట్ర సమితి పార్టీదే

_పార్టీ కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం_

 

_18వ తేదీన ఖమ్మం లో జరిగే భారత రాష్ట్ర సమితి బహిరంగ సభను విజయవంతం చేయండి_

 

_ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా హాజరుకానున్న ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్ ,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్_

 

ముదిగొండ మండలం జనవరి 11(నిజం న్యూస్):-

 

ముదిగొండ మండలం లో ప్రతి గ్రామం నుండి ఖమ్మం లో జరిగే సభకు భారీగా గులాబీ శ్రేణులు తరలి రావాలి. ముదిగొండ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ భారత రాష్ట్ర సమితి పార్టీదే అధికారం అని, పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండి కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు ఈ నెల 18వ తేదీన ఖమ్మం లో జరిగే భారత రాష్ట్ర సమితి పార్టీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బుధవారం నాడు వనంవారి కృష్ణాపురం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ముదిగొండ మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అందుకు నిదర్శనంగా నేడు కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు అంతా కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి పార్టీ బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన ఖమ్మం లో నిర్వహించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆ సభను విజయవంతం చేసేందుకు ప్రతి గులాబీ సైనికుడు బాధ్యత తీసుకొని పని చేయాలని కోరారు ఈ సభ ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఉండబోతోందని వారు స్పష్టం చేశారు ఈ సభ లో దేశ రాజకీయాలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ఖమ్మం నుండే తొలి కేక ఉండనున్నది అన్నారు ఈ సభలో మన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ముగ్గురు సీఎం లు కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారని వారికి ఘన స్వాగతం పలుకుతూ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముదిగొండ మండలంలోని మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అన్నారు. ఈ కార్యక్రమంలోభారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మా రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు గౌడ్, ఎంపీపీ సామినేని హరిప్రసాద్,ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల ఎలగొండ స్వామి, మేడేపల్లి సొసైటీ చైర్మన్ సామినేని వెంకటేశ్వరరావు,మండల రైతు సమన్వయ అధ్యక్షులు పోట్ల ప్రసాద్,నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల వీరారెడ్డి, పాము సిల్వరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చెరుకుపల్లి బిక్షం, బీసీ సెల్ మండల అధ్యక్షులు తోట ధర్మా, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఖాజా, మాజీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మీగడ శ్రీనివాస్, బంక మల్లయ్య, మహిళా అధ్యక్షురాలు ప్రమీలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు