బ్రాహ్మణ వర్గ సోదరులారా!! బిసి గౌడ సమాజాన్ని ఎదగనివ్వండి

_వైన్స్ షాప్ లకు దేవుళ్ళు పేరు పెట్టినప్పుడు లేనిది_
_కల్లుకి వేదామృంతం పేరును వ్యతిరేకించడం ఎంత వరకు కరెక్ట్…_
_బహుజన సమాజ్ పార్టీ ముదిగొండ మండల కన్వీనర్- పల్లెపొంగు రాజశేఖర్.._
ముదిగొండ జనవరి 11(నిజం న్యూస్):-
తాటి ఆకులు,కల్లు గురించి బ్రాహ్మణ పురోహితంలో గొప్పతనం తెలుసుకోని గౌడ సమాజ అభివృద్ధి సహకరించండి.. మీకు బతుకునిచ్చి మీ మంత్రాలను శ్లోకాలను భద్రపర్చుకుంది తాళపత్రాలు కాదా.? “తాటికమ్మలు” పెళ్లి పందిర్లుగా మీ ఇంటి పైకప్పుగా.. తాటి మొద్దులను మీ ఇంటి దూలాలుగా ఉండి మీకు నీడనిస్తే వాటిని కొట్టి తెచ్చిన గౌండ్లను అవమానించడం కాదా..?
వేద మంత్రాల సాక్షిగా చెప్పండి తాటి ఆకును ఉండగా చుట్టి పసుపు కుంకుమ రాసి దారం కట్టి పెళ్ళి కూతుర్ల మెడలో తాళిబొట్టు (తాడిబొట్టు) మూడుముళ్లు వేయించింది నిజం కాదా ? అన్నారు
“తాటి కమ్మను కాలి వేలుకు చుట్టి మెట్టెలుగా వాడింది నిజంకాదా” ?
తాటి కమ్మలను తాళపత్రాలుగా ఉపయోగంలో ఉన్న కాలం నుంచి ఇప్పటికి అదే కొనసాగింపుగా పుస్తకంలోని పేజీలను కమ్మలని పిలవడం నిజం కాదా..? ఒక జంతువు నుంచి వచ్చే పాలు మీకు పవిత్రమైనప్పుడు చెట్టు నుంచి వచ్చే కల్లు అపవిత్రం ఎట్లైంది ? అని అడిగారు ‘మా ఇంటింట ఉన్న బహుజన దేవతకు ముందుగా కల్లారబోసి మొక్కుతం మమ్ములా మా సంస్కృతిని మీరు అవమానించినట్టు’ కాదా?
తాటి ముంజలు మీరు ఇష్టంగా తిన్నప్పుడు మేము అవమానించామా?
వైన్ షాపులకు హిందూ దేవతా మూర్తుల పేరు పెడుతున్నప్పుడు మీ మనోభావాలు మత్తులో ఉన్నాయా అంటూ ప్రశ్నించారు
“కల్పవృక్షమైన తాటి ఈత చెట్టు నుంచి లభించే తాటి బెల్లం, తాటి గేగులు, తాటి కల్లు అద్బుత ఔషదమని మీరు పంచమవేదంగా భావించే ఆయుర్వేదం” అంటుంది దానిని మీరు అవమానించడం కాదా..? బ్రాహ్మణ, హైందవ, హిందూ సంఘాలు అని అంటున్నారు అంటే మీరంతా ఒకటా వేరువేరా ?
బ్రాహ్మణ సోదరులు మా గౌడ సమాజ అభివృద్ధికి సహకరించాలి అని పల్లెపొంగు రాజశేఖర్ కొరారు.