అనారోగ్యంతో గ్రామశాఖ అధ్యక్షుడు మృతి.

కారేపల్లి,నిజం న్యూస్,జనవరి11:కారేపల్లి మండల పరిధిలోని పాత కమలాపురం గ్రామశాఖ బి. ఆర్. ఎస్ అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసరావు (50) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మృతుని భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రతి కార్యకర్తలను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మృతుడు శ్రీనివాస్ పార్టీ కోసం చాలా కృషి చేసాడని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపిటిసి ధారవత్ పాండ్య నాయక్, రైతు బంధు కన్వీనర్ గుగులోత్ శ్రీనివాసరావు, సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, నాయకులు అజ్మీర వీరన్న, ఇమ్మడి తిరుపతి రావు, వాంకుడొత్ కరణ్ సింగ్, ఉప సర్పంచ్ మల్లెల కోటయ్య, మాజీ సొసైటి డైరెక్టర్ చాగంటి కోటయ్య , ఎంపిపి మాలోత్ శకుంతల, మండల అధ్యక్షుడు ఉమ శంకర్, వైస్ ఎంపిపి రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ధారవత్ మంగిలాల్, సర్పంచ్ బాణోత్ కుమార్, మాలోత్ కిషోర్, సొసైటీ డైరెక్టర్ లు అడ్డగోడ ఐల్లయ్య, రోశయ్య, ఉపేందర్, నాయకులు, ముత్యాల సత్యనారాయణ, తోటకూరి పిచ్చయ్య, యూత్ అధ్యక్షుడు రఘు నివాళులర్పించారు.