యాదగిరిగుట్టలో ఐజేయూ ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీకి ఘనంగా స్వాగతం

హైదరాబాద్ జనవరి 11 నిజం న్యూస్
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీ యాదాద్రి కి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టపర్తి భాస్కర్ గౌడ్. ఈ సందర్భంగా వారి వెంట ఉండి యాదాద్రి వైభవాన్ని వివరించారు. యాదాద్రి అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2200 కోట్ల రూపాయలను వెచ్చించి నిర్వహించిన పనులను కూడా ఆయన వారికి వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెలంగాణ నుంచి జాతియ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సయ్యద్ ఇస్మాయిల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన రాజమౌళి చారి, అవ్వారూ భాస్కర్ లను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పత్రికలు చానల్లో పనిచేస్తూ జాతీయ సమితికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు యాదాద్రి గురించిన విశేషాలను తెలియపరచడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. యాదాద్రి దేవస్థానం ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు ఐజేయూ ప్రతినిధులకు ఆశీర్వచనం జరిపారు. పర్యవేక్షకులు రాజన్ బాబు దగ్గరుండి ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులు వారిని కలిసి ఫోటోలు దిగారు.