అన్నారం భూములను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి… పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

పటాన్ చెరువు జనవరి 10 (నిజం న్యూస్)
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ సరిహద్దుల్లో గల సర్వే నంబర్ 261 లోగల సుమారు 588 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కబ్జా చేసి 1500 కోట్ల రూపాయల స్కాం స్థానిక టిఆర్ఎస్ సర్పంచ్ తిరుమల వాసు రైతులు, ఎస్సీ ఎస్టీ బిసి వర్గాల భూములను రక్షించాలనీ అర్హులైన వారికి పట్టా పాస్బుక్కులు అందించాలని తిరుమల వాసు ప్రశ్నించినందుకు అతనిని సస్పెండ్ చేయడం ముఖ్యమంత్రికి మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారం జరిపించాలి. అర్హులైన రైతులకు పట్టా పాస్ బుక్కులను ఇవ్వాలని బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు అన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో 261 సర్వే నంబర్లు లోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేంతవరకు తన వంతు పోరాటం చేస్తూనే ఉంటాను అని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను త్వరలో తీసుకువచ్చి రైతుల పక్షాన నిల్చుంటామన్నారు సమస్య పరిష్కరించకపోతే త్వరలో భారీ ఎత్తున ధర్నా ను చేపట్టడం తద్యమని హెచ్చరించారు అనుకుంటా ఉప సర్పంచ్ పలుగు గోవర్ధన్ రెడ్డి బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి బిజెపి మాజీ మండల అధ్యక్షుడు నర్సపల్లి రాజిరెడ్డి అసెంబ్లీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి బిజెపి మండల ఉపాధ్యక్షులు కావలి ఐలేష్ అన్నారం బూత్ అధ్యక్షులు డప్పు శ్రీనివాస్ శివరాత్రి రాజు ఉదయ్ కుమార్ నవీన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు