సతులకు బదులు పతులు

తరిగొప్పుల జనవరి 10 (నిజం న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు చేపట్టబోతున్న కంటి వెలుగు కార్యక్రమంపై తరిగొప్పుల రైతు వేదిక భవనంలో మండల వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీల అధ్యక్షతన మంగళవారం ఎంపిడివో జయారావు అధికారులు, ప్రజాప్రతినిధులతో అధికారిక సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరు కావాల్సి ఉండగా పొతారం, కొత్తతండ గ్రామాలకు చెందిన మహిళ సర్పంచులకు బదులుగా వారి స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరు కావడంతో మహిళ సాధికారతకు భంగం కలుగుతుందని పలువురు మహిళ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజల చేత ప్రత్యేక్షంగా ఎన్నుకోబడిన మహిళ ప్రజా ప్రతినిధులే పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఎంపిడివో సమక్షంలో మహిళ ప్రతినిధులకు బదులు వారి భర్తలు సమావేశానికి హాజరు కావడమే కాకుండా రిజిస్టర్లో వారే సంతకాలు చేయడం తో మండల వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.