ప్రమాదకరంగా మారిన గుంతల రోడ్లు

మొన్న టాక్లీ వద్ద ప్రాణం తీసిన గుంత
నిన్న ముధోల్ లో తృటిలో తప్పిన ప్రాణ హాని.
ముధోల్ నియోజకవర్గం ఇంచార్జి జనవరి 10(నిజం న్యూస్)
ముధోల్ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందర గుంతల రోడ్డు వలన ప్రమాదం సంభవించినది. గుంతలను తప్పించే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడం వలన రోడ్డు యొక్క భద్రత ప్రమాణాలు ఏవిధంగా వున్నాయో అర్థం అవుతుంది.మిట్ట మధ్యానం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడం వాహన చోదకులు, అధికారులు ఆలోచించాల్సిన విషయం.అనునిత్యం రద్ధిగా వుండె రోడ్డు, పూర్తి రోడ్డు గుంతగా మారీన, వారు సైతం రోజు ప్రయాణించే రోడ్డు పట్టించుకొని అధికారులు. బాసర మండలంలోని టాక్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి రహదారిపై వున్న చిన్న గుంత ప్రాణం తీసింది.బిధ్రెల్లి వంతెన నుండీ టాక్లి వరకు, ముధోల్ పోలీసు స్టేషన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండీ ఎల్ వి ప్రసాద్ కన్ను ఆసుపత్రి వరకు,ధేగాం సాయిబాబా మందిరము నుండీ భైంసా చెక్ పోస్ట్ వరకు, ఆ మధ్యలో అక్కడక్కడ రోడ్డు అధ్వానంగా వున్న పరిస్థితి.బాసర కు చెందిన శివ తో పాటు మరొ వ్యక్తికి గాయాలు అయ్యాయి. ముధోల్ ఎస్.ఐ తిరుపతి సరైన సమయం లో స్పందించి భైంసా ఏరియా ఆసుపత్రి కి తరలించిన తరలించారు.యుద్ధ ప్రతిపాధికంగా ఏ ప్రాణహాని జరుగక ముంధే గుంతలు పూడిస్తే బాగుంటదని ప్రజలు కోరుకుంటున్నారు