Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గంజాయి రవాణా చేస్తున్న ..ఐదుగురు అరెస్ట్

 

హుజూర్నగర్, గరిడేపల్లి, నడిగూడెం పోలీస్ స్టేషన్ ల నందు కేసులు నమోదు.

 

22కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.

 

జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేంలో కేసుల వివరాలు వెల్లడించిన…

 

జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ .

 

సూర్యాపేట జనవరి 10 నిజం న్యూస్

 

వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా హుజూర్నగర్, గరిడేపల్లి, నడిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగినదని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపినారు. గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం పై మంగళవారం జిల్లా వ్యాప్తంగా వాహనాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాం హుజూర్ నగర్ మీదుగా వెళుతున్న అనుమానంగా ఉన్న కారును తనిఖీ చేసి 20 kg ల గంజాయిని హుజూర్ నగర్ సీఐ అధ్వర్యంలో స్వాధీనం చేసుకోవడం జరిగినది. అలాగే గరిడేపల్ల పల్లిలో కూడా నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తి వద్ద 1Kg గంజాయి సీజ్ చేయడం జరిగినది, బస్సులో అనుమానంగా ప్రయాణిస్తున్న ఇద్దరినీ నడిగుడెం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుండి 1.5 kg ల గంజాయి సీజ్ చేయడం జరిగినది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుండి సుమారుగా 5 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్, రోహన్ రాజ్ ఫుట్ కాలు తివారి నలుగురు కలిసి జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నెల 5న జూమ్ లో క్యాబ్ బుక్ చేసుకొని 20కేజీల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ తరలించాల్సి ఉండగా పోలీసుల చెకింగ్ లకు భయపడి నాలుగు రోజుల పాటు అరకులో లాడ్జి తీసుకొని ఉండి ఈ నెల 9న కొనుగోలు చేసిన గంజాయిని తీసుకొని హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా రోహన్ రాజ్ ఫుట్, కాలు తివారీ బస్సులో హైదరాబాద్ చేరుకోగా గంజాయిని తీసుకొని హుజుర్ నగర్ మీదిగా హైదరాబాద్ వెళ్తున్న ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్ పోలీసులు చెకింగ్ చేస్తుండడంతో హుజూర్ నగర్ PS.పరిధిలో ఈరోజు పాటుపడ్డారు పట్టుబడ్డారు. వీరి నుండి టాటా పంచ్ కారు, 2 సెల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నడిగుడెం స్టేషన్కు కు సంభందించిన కేసులో ఏపీ కి చెందిన విజయ్ కుమార్, బంగారు రాజు హైదరాబాద్ లో హాస్టళ్లలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. స్నేహితులతో కలిసి గంజాయి తాగే అలవాటు ఉండగా వచ్చిన జీతాలు సరోపోకపోవడంతో వైజాగ్ నుండి మూడు నెలలకు ఒకసారి తక్కువ ధరకు గంజాయ్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకొంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో 1.50కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ వస్తుండగా నడిగూడెం వద్ద పోలీసుల తనిఖీ లలో పట్టుబడ్డారు. గరిడేపల్లి PS కు చెందిన కేసులో నల్లగొండ జిల్లా గుర్రం బోడు మండలం బొల్లారం గ్రామనికి చెందిన పురం గణేష్ పారా మెడికల్ చదువు మధ్యలోనే ఆపేసి కూలి పనులు చేస్తూ గంజాయికీ అలవాటు పడ్డాడు. దాచేపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 800గ్రామాల గంజాయిని కొనుగోలు చేసి గరిడే పల్లి లో తిరుగుతుండగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అంధించి యువతను గంజాయి బారి నుండి కాపాడాలని ఎస్పీ సూచించారు. కేసులో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందించారు.

ఈ సమావేశంలో కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర్లు, మునగాల సిఐ ఆంజనేయులు, హుజుర్ నగర్ సిఐ రామలింగారెడ్డి, ఎస్సైలు ఏడుకొండలు, వెంకట్ రెడ్డి, కొండల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.