ఉప సర్పంచ్ పదవి కోసం.. తెర వెనక రాజకీయాలు?

ఈనెల 12న ఉప సర్పంచ్ పదవి కోసం… అవిశ్వాస తీర్మానం.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి…. తుంగతుర్తి ఎంపీడీవోకి సర్కిల్ విడుదల.. అన్నారంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేనా….
ఒక్కొక్క వార్డ్ మెంబర్ కు లక్ష రూపాయలు…. అన్నారంలో విచిత్రం.. పార్టీ. నాయకుల్లో మొదలైన గుసగుసలు..
హైదరాబాదులో తిష్ట వేసిన. అధికార పార్టీ వార్డు మెంబర్లు…. జోరుగా మందు పార్టీలట…
హుజూర్ నగర్ ప్రతినిధి, జనవరి 10 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీకి, 12 వార్డుల తో గ్రామపంచాయతీ ఏర్పడింది. ప్రస్తుతం ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి 9 మంది వార్డు మెంబర్ లతో.. పదవిలో ఉన్నాడు. దీనితో గ్రామానికి ఒకసారిగా దళిత బంధు పథకం తోడై…., అన్న్య రీతిలో వార్డు మెంబర్ల మధ్య సఖ్యత లోపించడం, కొందరు అధికార పార్టీలో చేరడంతో, ప్రస్తుతం ఉప సర్పంచ్ పదవి, గండంగా. మారినది.. దీనితో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఈనెల 12న అవిశ్వాస తీర్మానం ఏర్పాటుచేసి నూతన ఉపసర్పించని ఎన్నుకోవాలని తుంగతుర్తి ఎంపీడీవోకు సర్కిల్ విడుదల చేసినట్లు సమాచారం.
గతంలో 9 వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ, కేవలం 3 వార్డులు బి ఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు, రావడంతో, అధికార బి ఆర్ఎస్ పార్టీ లో ఎక్కువ వార్డు మెంబర్లు రావడం చేరడంతో, ఒక్కసారిగా క్యాంపు రాజకీయాలు జరిగి, ఏకంగా గత మూడు రోజుల క్రితం ,అధికార పార్టీ నాయకుల వార్డు మెంబర్లను, హైదరాబాద్ క్యాంపుకు తరలించినట్లు సమాచారం. దీనితో అధికార పార్టీ వార్డు మెంబర్లు సుమారు 6 నుంచి8, వార్డ్ మెంబర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు పలువురు చెబుతున్నారు… ఏది ఏమైనా గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉన్నది. కేవలం ఉప సర్పంచ్ పదవి కోసం, ప్రస్తుతం ఒక్కొక్క వార్డ్ మెంబర్ కు దళిత బంధు తోపాటు, లక్ష రూపాయలు ఇస్తామంటూ, భేరసారాలు నడుస్తుండడం గమనార్వం. వెనకట సామెత కలిసొచ్చే సమయానికి…. నడిచొచ్చే కొడుకు ఉన్నట్లుగా ప్రస్తుతం అన్నారంలో ఉప సర్పంచ్ పదవి మారింది. ఏ సమయానికి ఏమి జరుగుతుందో…. ఎవరు ఉప సర్పంచ్ పదవిని పొందుతా రో,… అవిశ్వాస తీర్మానంలో…. వేచి చూడాల్సిందే సుమ…