సంగారెడ్డి జిల్లా లో సర్వే నంబర్ 76 లో 36 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 76 లోని 36 ఎకరాల 32 గుంటల పూర్తి విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని కబ్జకు గురి కావడం జరిగింది మొగడంపల్లి స్థానిక బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మొగుడంపల్లి సీనియర్ టిఆర్ఎస్ స్థానిక ఎంపీటీసీ సభ్యులు మొహమ్మద్ కుతుబుద్దీన్ మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు పట్లోళ్ల భాస్కర్ రెడ్డి మరియు మాజీ ఉప సర్పంచ్ బోయిని రాములు మరియు కొంగల్ అంజయ్య అనంతు బాలరాజ్ మరియు నాగన్కేరి కమల్ రెడ్డి మరియు మండల్ ఎంఐఎం ప్రెసిడెంట్ మొహమ్మద్ వలి మరియు ఎడ్ల రామ్ రెడ్డి రవి వీరు కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొనింటి మానికిరావును మరియు జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పార్టీలను కూడా తెలియజేయడం జరిగింది ఈ సర్వే నంబర్ 76 లోని 36 ఎకరాల 32 గుంటల భూమిని స్థానిక ప్రజలు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి పై అధికారుల దృష్టికి తీసుకో వెళ్లడం జరిగింది కానీ ఫలితం లేకపోవడంతో స్థానిక ప్రజలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క భూమి ఒక ఎకరం విలువ కోటి రూపాయల అంచనా కలదు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు దృష్టికి తీసుకు పోవడంతో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ను 76వ సర్వేనెంబర్ 36 ఎకరాల 32 గుంటల భూమిని ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశాలు జారీ చేయడం జరిగింది