చేవెళ్లలో మోడ్రన్ బస్ స్టేషన్

-ఆర్కిటెక్ అధికారులతో ఎంపీ సమీక్ష సమావేశం*
చేవెళ్ల,జనవరి06(నిజం న్యూస్)
ఎన్నో సంవత్సరాలుగా చేవెళ్ల బస్ స్టేషన్ చిన్నదిగా ఉండడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని దాని దృష్టిలో పెట్టుకొని చేవెళ్ల లో రూ.3 కోట్లతో 2.5 ఎకరాల్లో అధునాతన అంగులతో నూతన బస్ స్టేషన్ నిర్మించ బోతున్నారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. ‘మాడ్రన్ చేవెళ్ల బస్టాండ్ డిజైన్ ఎలా వుంటే ప్రయాణికులకు సౌకర్యవంతంగా వుంటుంది’ అనే అంశంపై శుక్రవారం ఆర్కిటెక్ట్ అధికారులతో ఎంపీ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… గత పాలనలో చేవెళ్ల బస్టాండ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ప్రయాణికుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా
3 కోట్ల రూపాయలు బస్ స్టేషన్ గురించి మంజూరు చేశారని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కొరకు తన ఎప్పుడు ముందుంటానని తెలిపారు.