చేవెళ్ల లో రవాణా రంగ కార్మికుల సంఘర్షణ యాత్ర

-రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*
-రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించారు*
-సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య*
చేవెళ్ల,జనవరి07(నిజం న్యూస్)
ఆర్టీసీని పరిరక్షించాలని రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.సిఐటియు రవాణా సంఘర్షణ యాత్ర చేవెళ్ల మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ యాత్ర బృందంలో ఉన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య,పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్,కూరపాటి రమేష్ లకు సిఐటియు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందికి పైగా కార్మికులు రవాణా రంగంలో పనిచేస్తున్నారని ప్రధానంగా ఆటో ట్యాక్సీ,గూడ్స్ రవాణా,స్కూల్ బస్సుల వంటి వాటిలో పనిచేస్తున్నారని ఉన్నత చదువులు చదువుకున్న ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో ఈ రంగంలో స్వయం ఉపాధిని పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు వారి సమస్య పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా వివిధ రకాల వేధింపులు గురిచేస్తూ బ్రతకడమే కష్టంగా మారుస్తున్నారని రవాణా రంగ కార్మికుల పరిస్థితుల్లో మార్పులు చేయాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పెంచిన ఫైళ్లను తగ్గించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రవాణా రంగ కార్మికుల సంఘర్షణ యాత్రను సిఐటియు నిర్వహిస్తుందని అన్నారు. ఈ యాత్ర చేవెళ్ల డివిజన్ కు విచ్చేసిందని చేవెళ్ల డివిజన్లో అంగన్వాడి ఆటో రవాణా రంగ కార్మికులు గ్రామపంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి కవిత సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్, సిఐటియు చేవెళ్ల డివిజన్ కన్వీనర్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్ కుమార్ శ్రీనివాస్, శ్రీకాంత్ ఆటో యూనియన్ నాయకులు ప్రవీణ్ గౌడ్ బాబు పెద్దల్లో రవి, అంగన్వాడి సెక్టార్ నాయకురాలు వరలక్ష్మి, ఉమా, లక్ష్మి స్వప్న కల్పన ప్రేమలత మంగమ్మ రాధ సౌభాగ్య భాగ్యమ్మ ప్రవీణ భవన నిర్మాణ కార్మికులు ప్రభుదాస్ బుచ్చయ్య, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు