ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ నోట్లు, బంగారం కలకలం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జనవరి 06 (నిజం న్యూస్)
అదిలాబాద్ జిల్లాలో ఎస్పీ ఉదయ్ కిరణ్ రెడ్డి ఏఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు నకిలీ బంగారం నకిలీ కరెన్సీ శుక్రవారం నాడు రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన ఒక కారు.TS07FD.7394 గల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగులలో బంగారం రంగులో చైన్స్ అందులో 1130 గ్రాముల బంగారం వంద రూపాయల నోట్ల కట్ట(children Bank of india) అని రాసి ఉన్న దాన్ని పోలీసులు గమనించి నిందితులను విచారించగా ఇచ్చోడ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి నేరేడిగూండా కు చెందిన ఒకరి వద్ద 30 వేల రూపాయలు ఆదిలాబాద్ కు చెందిన ఒకరి వద్ద 80 వేల రూపాయలు తీసుకుని వాళ్ళను నమ్మించి మోసం చేసినాము అని నిందితులను చెప్పగలను పోలీసులు అరెస్టు చేశారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఒక గ్రూపుగా ఏర్పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని 2.30.000 వేల రూపాయలకు 10 తులాలు బంగారం ఇస్తామని చెప్పి అతని వద్ద నుండి 30 వేల రూపాయలను తీసుకొని తర్వాత బంగారం ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు రెండు లక్షలు ఇస్తామని నమ్మించి అలాగే అదిలాబాదుకు చెందిన వారి దగ్గర 80 వేల రూపాయలు ను తీసుకుని నమ్మించి మోసం చేసినా మా అని పోలీసులకు చెప్పగా వెంటనే వారి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు