జిల్లా శ్రీనిధిలో…. భారీ మోసం!
జిల్లాలో సుమారు 71,34,828… ఇందులో గొట్టిపర్తి 4, 98,461 రూపాయల మోసం గా గుర్తింపు.
పేదల సొమ్మును …..దోచుకుంటున్న మహిళా రాబంధులు.
తుంగతుర్తి, జనవరి 6 నిజం న్యూస్
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా , మహిళా సమాఖ్యలను ఏర్పాటు చేసింది., దీనిలో భాగంగా శ్రీనిధి ద్వారా, బ్యాంకుల నుండి అప్పులు తీసుకొని, ప్రతి నెల తిరిగి చెల్లిస్తూ, ఈ పథకం ద్వారా మహిళలు అభివృద్ధి చెందుతున్నారు. కొంతమంది వివో ఏ, ల దుర్బుద్ధి వలన కష్టపడకుండానే, డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో, గ్రామాల్లో పేద మహిళలు కష్టపడి నెలల వాయిదాలు చెల్లిస్తుంటే , అందినప్పుడే, దోచుకోవా లనే, దుర్బుద్ధితో, మహిళలు నెల, నెల డబ్బులు చెల్లించినప్పటికీ, బ్యాంకులకు వచ్చి, వేసినట్లుగా చెబుతూ… మహిళల నుండి సేకరించిన డబ్బును, తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటూ, బ్యాంకులకు డబ్బులు కట్టకపోవడంతో, ప్రతి సంవత్సరం జిల్లా అధికారులు ఆడిట్ జరగగా, జిల్లాలో మొత్తం శ్రీనిధి లో జరిగిన మోసం సుమారు 71 లక్షల 34,828 రూపాయల గా జిల్లా నుండి సంబంధిత మండలాల్లో, జరిగిన గ్రామాల్లో జిల్లా కలెక్టర్ నుండి సర్క్యులర్, డి ఆర్ డి ఏ శాఖ ద్వారా, జారీ చేశారు.
దీనిలో తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో వివో ఏ, శ్రీనిధి అవినీతి సుమారు 4లక్షల,98,461 గా సంబంధిత జిల్లా అధికారులు గుర్తించారు. మహిళా సమైక్యలో, మహిళలే అవినీతిపరులుగా సమాజంలో రావడం దురదృష్టకరమైన విషయం. ఈ విధంగా వాడుకున్న పేద ప్రజల కష్టార్జితాన్ని , సంబంధిత అధికారులు, వివో ఏ ల నుండి ఏ విధంగా, విచారణ చేసి, ఏ విధంగా రాబడతారో వేచి చూడాల్సిందే …