వైద్య అధికారిని డాక్టర్ మౌనిక సేవలు అమోఘం

*అడవుల్లో వైద్యం చేసి ఆదివాసి మన్ననలు
చర్ల జనవరి 4 ( నిజం న్యూస్) సత్యనారాయణపురం వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక సేవలు అమోఘమని పలువురు వక్తలు కొనియాడారు గురువారం వైద్యశాల ఆవరణలో డి.పి.ఎమ్.ఓ . చింత సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సన్మాన సభ లో ఎంపీపీ కోదండ రామయ్య. జడ్పిటిసి ఇర్ప శాంత. తాసిల్దార్ బి భరణి బాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన సత్యనారాయణపురం వైద్య అధికారిగా 2018 సంవత్సరంలో విధులు చేపట్టి నాలుగున్నర ఏళ్లపాటు 45 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించిన ఘనత ఆమెదే అన్నారు గర్భిణుల సంరక్షణతో పాటు 864 ప్రసవాలు. 243 టూబెక్టమీలు. పిల్లల టీకాలు. రాష్ట్ర కేంద్రాలు ప్రోగ్రామ్ మూలలో నిర్వహించారని అన్నారు మావోయిస్టు ప్రాబల్య గ్రామాల్లోకి భయపడకుండా వెళ్లి ఆదివాసీలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.. బూర్గంపాడు ప్రజలకు మంచి సేవలు అందించి ఎక్కడలాగే పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆశిస్తున్నామన్నారు
వైద్య అధికారిని డాక్టర్ మౌనిక మాట్లాడుతూ .
నాలుగున్నర సంవత్సరాలు సత్యనారాయణపురం పిహెచ్సిలో విధులు నిర్వహించి అటవీ ప్రాంత గిరిజనులకు వైద్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాకు అవార్డు రావడానికినాకు సహకరించిన మండల ప్రజలకు తోటి సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మౌనిక భర్త భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ రామకృష్ణ లకు శాలువతో ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్. సత్యనారాయణపురం వైద్య అధికారిని దివ్య నయన. వైద్య సిబ్బంది. ఆశా వర్కర్లు పాల్గొన్నారు